Liquor Sales: సమయం లేదు మిత్రమా.. వైన్ షాపులకు పోటెత్తిన మందుబాబులు.. కలెక్షన్స్ ఫుల్.. షాపులన్నీ నిల్!

|

May 11, 2024 | 5:00 PM

ఎన్నికల పోలింగ్‌.. మందుబాబుల వీకెండ్‌ ప్లానింగ్‌పై దెబ్బకొట్టింది. రెండ్రోజుల పాటు వైన్‌ షాప్స్‌ క్లోజ్ అవుతుండటంతో... మందుబాబుల ఆత్రుతకు అవధులు లేకుండా పోయాయి. తొందర పడకుంటే మూడు రోజుల పాటు చుక్క కూడా దొరికే ఛాన్సు ఉండదంటూ... వైన్స్ షాపుల ముందు క్యూ కట్టారు.

Liquor Sales: సమయం లేదు మిత్రమా.. వైన్ షాపులకు పోటెత్తిన మందుబాబులు.. కలెక్షన్స్ ఫుల్.. షాపులన్నీ నిల్!
Wines Rush
Follow us on

వీకెండ్‌లో చిల్డ్‌ బీర్‌తో చిల్‌ అవ్వాలనుకుంటున్నారా…? మందేస్తూ సండేని ఫన్‌డేగా మార్చుకోవాలనుకుంటున్నారా…? ఫ్రెండ్స్‌తో కలిసి లిక్కర్‌ లాగిస్తూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేయాలని ప్లాన్‌ చేసుకున్నారా…? అయితే లిక్కర్‌ బాబులకు తాగకుండానే కిక్కు దిగిపోయే న్యూస్‌ చెప్పింది ఈసీ. ఎన్నికల నేపథ్యంలో 48 అవర్స్‌ నో లిక్కర్‌ అంటూ… మద్యం షాపుల క్లోజింగ్‌కు ఆదేశాలిచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మద్యం దుకాణాలు బంద్‌ అయ్యాయి. మళ్లీ 13వ తారీఖు సాయంత్రం లిక్కర్‌ షాపులు తెరుచుకోనున్నాయి. దీంతో బీరు కోసం బాధలు, వైన్‌ కోసం వర్రీస్‌ మొదలయ్యాయి.

ఎన్నికల పోలింగ్‌.. మందుబాబుల వీకెండ్‌ ప్లానింగ్‌పై దెబ్బకొట్టింది. రెండ్రోజుల పాటు వైన్‌ షాప్స్‌ క్లోజ్ అవుతుండటంతో… మందుబాబుల ఆత్రుతకు అవధులు లేకుండా పోయాయి. తొందర పడకుంటే మూడు రోజుల పాటు చుక్క కూడా దొరికే ఛాన్సు ఉండదంటూ… వైన్స్ షాపుల ముందు క్యూ కట్టారు. దీంతో ఎక్కడా చూసినా వైన్‌ షాపులన్నీ కిటకిటలాడాయి.

కిక్కు కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించాయి. దేవుడా.. ఒక్క క్వార్టరైనా వచ్చేలా చూడు… నా దగ్గరకు వచ్చేవరకు స్టాక్‌ ఉండేలా చూడు అంటూ… లిక్కర్‌బాబులు దేవుడ్ని వేడుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా బాటిళ్ల కోసం బారులుతీరారు. ఇక మందుబాబుల తాకిడికి కొన్ని వైన్స్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నప్పటికీ మందు దొరకని పరిస్థితులు కూడా కొన్నిచోట్ల ఏర్పడ్డాయి. దీంతో అసహనంతో వెనుదిరిగి వెళ్లిపోయారు మందుబాబులు. ఎండవేడి తాళలేక చిల్డ్‌ బీర్‌ తాగి చిల్‌ అవుదామన్న వారి ఆశలు అడియాశలయ్యాయి.

ఎన్నికల దృష్ట్యా ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగొద్దని భావించిన ఎన్నికల సంఘం … 48 గంటల పాటు మద్యం షాపులతో పాటు కల్లు కంపౌండ్లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. దీంతో మందుబాబులు కష్టాలు రెట్టింపయ్యాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..