ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో మానవ జాతికి అంతం తప్పదా.? శాస్త్రవేత్తల మాటల్లో నిజం ఎంత.!

| Edited By: Ravi Kiran

Jul 16, 2023 | 12:08 PM

టెక్నాలజీ పరంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.అన్ని రంగాల్లో AI ప్రమేయం బాగా పెరిగిపోతుంది.దీనివల్ల రానున్న రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు..

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో మానవ జాతికి అంతం తప్పదా.? శాస్త్రవేత్తల మాటల్లో నిజం ఎంత.!
Artifical Intelligence
Follow us on

టెక్నాలజీ పరంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.అన్ని రంగాల్లో AI ప్రమేయం బాగా పెరిగిపోతుంది.దీనివల్ల రానున్న రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.ఇంతకీ AI వల్ల నిజంగా లాభమా?నష్టమా?నిపుణులు ఏం అంటున్నారు. రానున్న రోజుల్లో మొత్తం టెక్నాలజీ రాజ్యం ఎలుతుంది.AI మోత్తం గా అందుబాటులోకి వస్తె కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉండనున్నాయి.AI విస్తరిస్తే మానవ మనుగడకు ముప్పు కూడా ఉండే అవకాశం లేకపోలేదు అని నిపుణుల అభిప్రాయం.ప్రస్తుతానికి ఉద్యోగాలు కోల్పోతారు అని ఒక సర్వే రిపోర్టు.

AI లాంటివి ఇప్పుడు ఎంతో అవసరం ఉంది అని కొన్ని రంగాల నిపుణుల అభిప్రాయం.నిర్మాణ రంగానికి సంబంధించిన విషయం లో AI లాంటి టెక్నాలజీ వచ్చిన 2030 నాటికి స్కిల్ కలిగిన లేబర్ శార్టీజ్ 4కోట్ల వరకు ఉంది అని నిపుణులు అంచనా.కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా AI రావడం మంచి విషయం అంటున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రాబోయే రోజుల్లో మన జీవితాలను ప్రభావితం చేస్తుంది.మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది AI.రోబోటిక్ సర్జరీ,బాంబ్ దిఫ్యుజ్ చేయడం,లాంటివి హ్యూమన్ ఎర్రర్ లేకుండా చేస్తుంది.దీని వల్ల ఎన్నొలాభాలు ఉన్నాయి. టెక్నలాజి రంగం లో ai ఎంతో హెల్ప్ అవుతుంది కానీ ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది.ఎందుకు అంటే ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే నష్టం కూడా ఉంది. ఇది చాలా ఖర్చు తో కూడుకున్నది.దీనివల్ల అన్ ఎంప్లమెంట్ పెరుగుతుంది. కొత్త గా క్రియేటివ్ గా ఉండదు.మనుషులను లేజిగా అయ్యేలా చేస్తుంది.ఎథిక్స్,ఎమోషన్స్ అస్సలు ఉండవ్,మానవ మనుగడ కి కూడా ముప్పు ఉండే ఛాన్స్ ఉంది.

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వస్తే ఉద్యోగాలు కోల్పోతాం నిజమే కానీ ఎలాంటి ఉద్యోగాలు పోతాయి అనేది తెలుసుకోవాలి. ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తరవాత చేతి తో రాసేవారు అంతరించిపోయారు. గూగుల్ రాకముందు ఏదైనా విషయం తెలుసుకోవడానికి రోజు సమయం పట్టేది. కానీ సెర్చ్ వచ్చాక గంట లో అయిపోతుంది.Ai ద్వారా పని సులువుగా వేగంగా అవుతుంది. రొటీన్ వర్క్ ఇజిగా ఆవుతుంది. కొన్ని పనులను చేయడానికి యూజ్ అవుతుంది తప్ప టోటల్ గా మనిషి నీ తప్పించి ai తో పని అవుతుంది అనేది అపోహ. టెక్నాలజీలో వస్తున్న మార్పులలో ఈ AI ని చూడాలి తప్ప.. మనిషిని రీప్లేస్ చేసే విధంగా ఉంటుంది అనుకోవడం నిజం కాదు అనేది నిపుణులు అభిప్రాయం.