Mobile SIM: కాలంతో పాటు టెక్నాలజీలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. డైరెక్ట్ మొబైల్ కాల్ నుంచి సిమ్ పరిమాణానికి మార్పు జరిగింది. ఫలితంగా ఇప్పుడు వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయి. కాలగమనంలో ప్రతీది మారుతున్నట్లుగానే.. మొబైల్ సిమ్ కార్డు కూడా నిరంతరం రూపాంతరం చెందుతూ వస్తోంది. అవును సిమ్ కార్డు మొదట్లో చాలి భిన్నంగా ఉండేది. మొదట్లో సిమ్ కార్డు దీర్ఘచతురస్రాకారంలో ఉండేది. ఆ తరువాత సిమ్ పరిమాణంలో స్వల్ప మార్పు వచ్చింది. సిమ్ కి ఒక అంచున కట్ చేయడం జరిగింది. అంతేకాదు.. సిమ్ స్లాట్ కూడా అదే డిజైన్‌లో వచ్చింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సిమ్ ఎందుకు మార్చారో చాలా మందికి తెలియదు. సిమ్‌లో ఒక వైపు ఎందుకు కట్ చేశారు? మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు వినియోగదారుపై ఎలాంటి ప్రభావం చూపాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవాళ మనం తెలుసుకుందాం..
ఇదే అసలు కారణం..
తొలినాళ్లలో సిమ్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేని ఫోన్‌లను పోస్ట్‌పెయిడ్ ఫోన్‌లుగా పిలిచేవారు. ఆ తర్వాత ప్రీపెయిడ్ ఫోన్ల ట్రెండ్ మొదలై కంపెనీలు సిమ్‌లను తయారు చేయడం ప్రారంభించాయి. సిమ్‌కి నాలుగు మూలలు సమానంగా ఉండడంతో స్లాట్‌లో పెట్టేటప్పుడు నేరుగా పెట్టాలా, తలకిందులుగా వేస్తున్నారా అనే విషయంలో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేవారు. సరిగ్గా ఇన్‌సర్ట్ చేయనప్పుడు మళ్లీ పెట్టేవారు. చాలా సందర్భాల్లో సిమ్ రివర్స్‌గా వేయడం వల్ల అది ఇరుక్కుపోవడమో, సిమ్‌లోని చిప్ పాడైపోవడమో జరిగేది. ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగానే.. కంపెనీలు సిమ్ డిజైన్‌ను మార్చాలని భావించాయి. ఈ క్రమంలోనే సిమ్ అంచున కట్ చేశారు. అలా సిమ్‌లో మార్పు వచ్చింది.
సిమ్ మార్పు వల్ల అది కూడా మార్చాల్సి వచ్చింది..
సిమ్ డిజైన్‌లో మార్పు వల్ల మొబైల్ కంపెనీలు సైతం మొబైళ్లలో సిమ్ ట్రే డిజైన్‌ను కూడా మార్చాయి. ఆ తర్వాత మొబైల్‌లో సిమ్ ఇన్‌స్టాల్ చేయడం సులభతరమైంది. SIM ట్రేలో అంతర్నిర్మిత పరిమాణం.. SIM కి అనుకూలంగా అమర్చడం సులభమైంది. ఈ విధంగా సిమ్ దెబ్బతినకుండా మార్పు అనివార్యం అయ్యింది.
కట్ మార్క్ కారణంగా వినియోగదారులు దానిని సిమ్ ట్రే లో సులభంగా ఇన్‌సర్ట్ చేయగలుగుతున్నారు. అయితే, సిమ్ కార్డ్ కాలానుగుణంగా రూపాంతరం చెందుతూనే ఉంది. సిమ్ పరిమాణం టెక్నాలజీకి అనుగుణంగా మారుస్తున్నారు. SIM కార్డు కొత్త పరిమాణం ప్రపంచ వ్యాప్తంగా అందరిచే గుర్తింపు పొందింది. దాదాపు అన్ని కంపెనీలు ఈ పరిమాణం తగ్గట్లుగానే సిమ్ స్లాట్స్ ఏర్పాటు చేస్తున్యనాయి. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ISO గుర్తింపు కూడా పొందింది. SIM కార్డులను తయారు చేసే ఫ్రెంచ్ కంపెనీ Idemia ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఉంది. ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచంలోనే సిమ్ కార్డ్ హబ్‌గా మార్చాలని ఐడియా ప్లాన్ వేస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఐడియా కంపనీ భారతదేశంలో సిమ్ కార్డుల ఉత్పత్తిని విస్తరించే పనిలో ఉంది.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..