చిన్న, చిన్న విషయాలే.. కానీ వాటి వెనుక కారణాలకు అన్వేశిస్తే మాత్రం అంతుచిక్కవు. ఇప్పుడు మీ ముందుకు అలాంటి విషయాన్నే తీసుకొచ్చాం. వైద్యుడ్ని దేవుడితో సమానంగా భావిస్తారు ప్రజలు. డాక్టర్లు కూడా ఎల్లప్పుడూ రోగుల ప్రాణాలను నిలపడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు ఎప్పుడూ ఆకుపచ్చ లేదా నీలం రంగు ఉన్న దుస్తులను ఎందుకు ధరిస్తారో మీరు తెలుసా?. మనం నిశితంగా పరిశీలిస్తే, ఆపరేషన్ థియేటర్ లేదా ఆసుపత్రుల గదులలోని కర్టన్లు కూడా ఆకుపచ్చ లేదా నీలం రంగులోనే ఉంటాయి. అదే క్రమంలో మాస్కులు కూడా ఆకుపచ్చ లేదా నీలం రంగులో ఉంటాయి. ఇప్పుడు మీ మనసులో కూడా ప్రశ్న తలెత్తి ఉంటుంది. ఈ రెండు రంగులలో ఇంత ప్రత్యేకత ఏమిటి అని. అక్కడికే వస్తున్నాం ఉండండి.
కాగా గతంలో వైద్యుల నుంచి ఆసుపత్రికి వచ్చే సిబ్బంది అందరూ తెల్లని దుస్తులు ధరించేవారట. కాని 1914 సంవత్సరంలో ఓ పేరమోసిన డాక్టర్ కొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు. రీజన్ ఏంటంటే.. ఆపరేషన్ సమయంలో మానవ శరీరం, రక్తం, అంతర్గత అవయవాలను డాక్టర్లు ఎక్కువగా చూస్తారు. ఈ సమయంలో వారి మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆకుపచ్చ రంగును చూడటం వల్ల.. ఉద్రిక్తత నుంచి స్వాంతన లభిస్తుందట. అందుకే అప్పటినుంచి ఈ పద్దతిని అవలంభించారు.
దీనిని మనం శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిస్తే, మన కళ్ల జీవ నిర్మాణం ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను చూడగలిగే విధంగా తయారుచేయబడింది. మానవ కళ్లు ఈ రంగుల మిశ్రమం నుంచి తయారైన కోట్ల ఇతర రంగులను గుర్తించగలవు. కానీ ఈ రంగులతో పోలిస్తే, ఆకుపచ్చ లేదా నీలం రంగు మాత్రమే మన కళ్లకు ఉత్తమంగా కనిపిస్తుంది. ఈ కారణంగా, ఆకుపచ్చ, నీలం రంగులు కళ్లకి మంచివిగా భావిస్తారు.
Also Read: మాంత్రికుడి మాటలు విని.. గుప్త నిధుల కోసం 50 అడుగుల గొయ్యి.. అదే వారి ప్రాణాలు తీసింది
చిట్టి పాదాలతో తనయుడి తొలి అడుగులు.. భావోద్వేగానికి గురైన తండ్రి.. వైరల్ వీడియో
దంతాలు పసుపు పచ్చగా ఉన్నాయా..! చాలా పేస్ట్‌లు వాడి బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇవి ట్రై చేయండి..