
మనం నిత్య జీవితంలో వింటూ పెరిగే అనేక విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అవి మన జీవితంలో నిత్యకృత్యంగా మారాయి. అందువల్ల, మనం వాటి గురించి పెద్దగా ఆలోచించము. అలాగే, మనం అనారోగ్యానికి గురైనప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆయన మందులు రాస్తాడు. కొన్నిసార్లు ఇంజెక్షన్లు కూడా ఇస్తాడు. కానీ, ఈ ఇంజెక్షన్ సూదులు ఏ లోహంతో తయారు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంజెక్షన్ సూదులు ఎలా తయారు చేస్తారో తప్పక తెలుసుకోవాలి..
ఇంజెక్షన్ తీసుకుంటున్నప్పుడు సూది విరిగి మీ శరీరం లోపలే ఉంటే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? లేదా దానిని తయారు చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగించారు..? అది మీకు హాని కలిగిస్తుందా అని కూడా ఎప్పుడూ ఆలోచించి ఉండరు. కానీ, ఇంజెక్షన్ సూదులు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీనిని కార్బన్ స్టీల్ అని కూడా పిలుస్తారు. హైపోడెర్మిక్ సూదులు కొన్నిసార్లు ట్యూబ్ డ్రాయింగ్ అనే ప్రక్రియ ద్వారా స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా నియోబియం ట్యూబ్‌లతో తయారు చేస్తారు.
సూదిని తయారు చేయడానికి ట్యూబ్‌ను ఒక చిన్న డై ద్వారా లాగుతారు. తరువాత పైభాగాన్ని పదునుగా చేయడానికి వంచి, చర్మంలోకి సులభంగా చొచ్చుకుపోయేలా చేస్తారు. సూది బలమైన లోహంతో తయారు చేయబడటం చాలా ముఖ్యం. అలా తయారు చేస్తేనే అది విరిగి శరీరం లోపల చిక్కుకోకుండా ఉంటుంది. ఎందుకంటే, అలా ఇంజెక్షన్ సూది శరీరంలో విరిగిపోయినట్టయితే అది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..