Dream: కలలో గుడ్లు కనిపించాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?

మనలో చాలా మందికి ఏదొ ఒక సమయంలో కలలో గుడ్లు కనిపించడం సర్వసాధారణమైన విషయం. అయితే కలలో గుడ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది, స్వప్నశాస్త్రంలో దీనికి సంబంధించి ఏం తెలిపారంటే. కు ఒకవేళ కలలో గుడ్డు కనిపిస్తే అది శుభ సూచికమని అర్థం. మీ జీవితంలో త్వరలోనే శుభవార్త వినబోతున్నారని అర్థం. కొత్తగా ఏదైనా వ్యాపారం లేదా...

Dream: కలలో గుడ్లు కనిపించాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
Egg In Dream

Updated on: May 04, 2024 | 7:40 PM

రాత్రి నిద్రలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే స్వప్నశాస్త్రంలో మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుంది. అలాంటి ఓ కల గురించి ఈరోజు తెలుసుకుందాం.

మనలో చాలా మందికి ఏదొ ఒక సమయంలో కలలో గుడ్లు కనిపించడం సర్వసాధారణమైన విషయం. అయితే కలలో గుడ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది, స్వప్నశాస్త్రంలో దీనికి సంబంధించి ఏం తెలిపారంటే. కు ఒకవేళ కలలో గుడ్డు కనిపిస్తే అది శుభ సూచికమని అర్థం. మీ జీవితంలో త్వరలోనే శుభవార్త వినబోతున్నారని అర్థం. కొత్తగా ఏదైనా వ్యాపారం లేదా, ఉద్యోగం మారనున్నారని అర్థం చేసుకోవాలి.

ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం ప్రాప్తించే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అలాగే పెద్ద గుడ్డు కనిపిస్తే భారీ లాభాలు ఆర్జించనున్నారని అర్థం. అయితే కలలో పగిలిన గుడ్లు కనిపిస్తే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఏదో విషయంలో మానసిక ఆందోళన ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. గుడ్డు పొట్టును చూసినట్లు వస్తే మీకు రాబోయే రోజుల్లో మంచి జరగనుందని అర్థం.

ఇక కోడి లేదా పక్షి గుడ్డు పెడుతున్నట్లు కల వచ్చినా మీకు రానున్న రోజుల్లో మంచి జరగనున్నట్లు అర్థం. ఒకే స్థలంలో ఎక్కువ గుడ్లు కనిపిస్తే ధన లాభం కలగనున్నట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కలలో నల్లటి గుడ్డు కనిపిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..