Viral Video: ఇళ్ల చుట్టూ మొసలి ప్రదక్షిణలు.. ఒక్కరు బయటకొస్తే ఒట్టు.. షాకింగ్ వీడియో..
Viral Video: అదో అందమైన పల్లెటూరు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది.. ఆ పక్కనే భాగీరథి నది ప్రవాహం.. ప్రశాంతమైన వాతావరణంలో ఆ గ్రామ ప్రజలు సంతోషంగా ఉంటారు. రోజూలాగే ఆ రోజు కూడా చీకటి పడింది. ఇంకేముంది. ఎవరిళ్లలో వారు నిద్రకు ఉపక్రమించారు. హాయిగా నిద్రపోతున్నారు. కానీ, ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది.

Viral Video: అదో అందమైన పల్లెటూరు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది.. ఆ పక్కనే భాగీరథి నది ప్రవాహం.. ప్రశాంతమైన వాతావరణంలో ఆ గ్రామ ప్రజలు సంతోషంగా ఉంటారు. రోజూలాగే ఆ రోజు కూడా చీకటి పడింది. ఇంకేముంది. ఎవరిళ్లలో వారు నిద్రకు ఉపక్రమించారు. హాయిగా నిద్రపోతున్నారు. కానీ, ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది. ఎన్నడూ లేని విధంగా ఓ ఇంటి ముందు పెద్ద అలజడి రేగింది. కాసేపటికే మరో ఇంటి వద్ద శబ్ధం వచ్చింది.. ఇలా ఇల్లు తరువాత ఇల్లు.. ఊరంతా అలజడి చెలరేగింది. ఈ వింత శబ్ధాలతో బెదిరిపోయిన జనాలు నిద్రలేచి ఏంటా కిటికీలోంచి బయటకు దొంగి చూశారు. ఇంకేముంది వారి కళ్లకు కనిపించిన దృశ్యాలను చూసి భయంతో బెంబేలెత్తిపోయారు. ఇంతకీ అక్కడ వారికి కనిపించింది ఏంటంటే మొసలి. అవును, అర్థరాత్రి వేళ ఓ మొసలి ఊరంతా కలియతిరిగుతూ, ఇంటి గుమ్మాలను తచ్చాడుతూ రచ్చ చేసింది. ఈ ఘటన బెంగాల్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముందు భాగీరథి నది.. పాల్పర నదికి ఆనుకుని ఉన్న గ్రామం. ఈ మొసలి అక్కడి నుంచి వచ్చిందని భావిస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామస్థులు భయంతో నోరు మెదపకుండా ఉన్నారు. అయితే మంగళవారం ఉదయం ధైర్యం చేసి ప్రజలు ఆ మొసలిని సమీపించారు. అప్పటికీ అటవీశాఖ, పోలీసు అధికారులకు సమాచారం అందించడంతో.. వారు వచ్చి ఉన్నారు. మొసలిని బంధించారు.
స్థానికుల కథనం ఇలా ఉంది..
అర్థరాత్రి అయింది. ఇరుగుపొరుగు అంతా నిద్రిస్తున్నారు. వీధి కుక్కలు మొరుగుతున్నాయి. ఏదో తేడా కొడుతోంది. ఈ క్రమంలోనే కల్నా వార్డు నంబర్ 10 పాల్పరకు చెందిన మెంక పాల్ కుక్క అరుపు విని కిటికీలోంచి బయటకు చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి బెదిరిపోయాడు. మొసలి వీధుల్లో తిరగడం అతను గమనించాడు. అర్థరాత్రి తలుపు వద్దకు హంగామా చేయడంతో రాత్రి ఎవరూ తమ తమ ఇళ్ల నుంచి బయటకు రాలేదు. గ్రామం ముందు భాగంలో భాగీరథి నది ఉంది. పాల్పర నదికి ఆనుకుని ఉన్న గ్రామంలోకి మొసలి అక్కడి నుంచే వచ్చిందని భావిస్తున్నారు.
స్థానిక నివాసి మెంకా పాల్ మాట్లాడుతూ, ‘ఈ రాత్రి నా జీవితంలో మర్చిపోలేను. అస్సలు నిద్ర లేదు. మంచం మీదనే కూర్చుండిపోయాను. బయట కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. కిటికీ తెరిచి చూడగా, మొసలి పాకుతూ కనిపించింది. దెబ్బకు హడలిపోయాను.’ ని చెప్పుకొచ్చాడు.
పల్పరాకు చెందిన ఇంద్రజిత్ పాల్ మాటల్లో, “మేము 1 గంటలకు నిద్రపోతున్నాము. అప్పుడు పక్కింటి నుంచి మొసలి వచ్చిందని అరుపులు వినిపిస్తున్నాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. రాత్రికి పోలీసులు వచ్చారు. గంగాజలం కూడా పెరిగినట్లు తెలుస్తోంది. కనుక వచ్చి ఉండవచ్చు. మాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే, గ్యాంగ్‌లో మొసలి తిరుగుతున్నట్లు నేను ఎప్పుడూ చూడలేదు లేదా వినలేదు.”
అటవీ శాఖ అధికారి శివప్రసాద్ సిన్హా మాట్లాడుతూ, “గంగ ఇక్కడికి చాలా దగ్గరగా ఉంది. అక్కడ నుంచి మొసలి బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో మొసళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది మంచినీటి మొసలి. కాబట్టి మనుషులను కాటు వేయడం లేదా వెంబడించడం వారి స్వభావం కాదు. అయితే అది ఆ ప్రాంతంలోకి ఎలా ప్రవేశించిందనేది చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..