Water Dogs: నాగార్జున‌ సాగ‌ర్‌ రిజర్వాయర్‌లో అరుదైన జీవుల సందడి.. లాంచీ స్టేషన్‌ సమీపంలో దర్శనం..!

|

Jul 22, 2021 | 7:49 AM

నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ రిజర్వాయర్‌లో అరుదైన ఉభయచర జీవులు సందడి చేశాయి.. భారీ జలాశయాల్లో ఉండే నీటి‌ కు‌క్కలు కనిపించడంతో అందరూ అశ్చర్యానికి గురయ్యారు.

Water Dogs: నాగార్జున‌ సాగ‌ర్‌ రిజర్వాయర్‌లో అరుదైన జీవుల సందడి.. లాంచీ స్టేషన్‌ సమీపంలో దర్శనం..!
Water Dogs At Nagarjuna Sagar
Follow us on

Water Dogs at Nagarjuna sagar: నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ రిజర్వాయర్‌లో అరుదైన ఉభయచర జీవులు సందడి చేశాయి.. భారీ జలాశయాల్లో ఉండే నీటి‌ కు‌క్కలు కనిపించడంతో అందరూ అశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్‌ డ్యామ్‌లోకి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. రోజురోజుకి నీటిమట్టం పెరుగుతుండటంతో నీటికుక్కలు రిజర్వాయర్‌‌లోకి వచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇవీ సాగర్‌ డ్యామ్ వాటర్ స్కెల్ సమీపంలో, లాంచీ స్టేషన్‌ సమీపంలో సంచరిస్తున్నాయి.

చూసేందుకు ముంగిసలాంటి తల. మెడ చూస్తే సీల్ చేప గుర్తొస్తుంది. వీటిని నీటి కుక్కలని పిలుస్తారు. ఇదో రకమైన క్షీరదం. దీనికి శాస్త్రీయ నామం అట్టర్. పెద్దగా అలికిడి లేని నీటి వనరులున్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇవీ సరిసృపాలు.. నీటితో పాటు నేలపైనా ఉండగలవు. ప్రధానంగా చేపలను తిని జీవిస్తుంటాయి.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్‌ జలాశయానికి ఇన్ ఫ్లో ప్రారంభమైంది. క్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. దీంతో నీటి కుక్కలు రిజర్వాయర్‌‌లోని క్రస్ట్ గేట్ల కు సమీపంలో వాటర్ స్కేల్ దగ్గర దర్శన మిచ్చాయి. అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం నీటికుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

గతంలో ఇలాంటి వింత జంతువులు కనిపించాయి. 2017 లో శ్రీశైలంలో కూడా నీటి కుక్కలు దర్శనమిచ్చాయి. అంతకు ముందు కొల్లాపూర్‌, మన్ననూర్‌ సమీపంలో మత్స్యకారులకు చిక్కగా వాటిని హైదరాబాద్‌లో నెహ్రూ జూ పార్కుకు తరలించారు. నీటికుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Read Also… 

Viral Video: పోటీలో పాల్గొనలేదు.. కానీ, అందరి కంటే ముందే గమ్యాన్ని చేరాడు..! వైరలవుతోన్న వీడియో

Viral Video: మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రేయసి..! నెట్టింట్లో ఆకట్టుకుంటోన్న జిల్, ఫిల్ వీడియో