AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇదో అద్భుతం! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..

తన ప్రాణాలు ఇకపోయాయని అనుకునేలోపు హనుమంతుడు ఆ కోతికి అండగా నిలిచాడు. దాన్ని నదిలో కొట్టుకుపోకుండా కాపాడాడు..

Watch Video: ఇదో అద్భుతం! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..
Monkey Drowning
Ravi Kiran
|

Updated on: Nov 01, 2022 | 2:56 PM

Share

ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. ప్రవాహం ఉద్దృతంగా ఉండటంతో కొంతదూరం కొట్టుకుపోయింది. తన ప్రాణాలు ఇకపోయాయని అనుకునేలోపు హనుమంతుడు ఆ కోతికి అండగా నిలిచాడు. దాన్ని నదిలో కొట్టుకుపోకుండా కాపాడాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఘజియాబాద్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. ప్రవాహం ఉద్దృతంగా ఉండటంతో ఆ కోతి కొంత దూరం వరకు కొట్టుకుపోయింది. అయితే నది మధ్యలో ఉన్న హనుమంతుడి విగ్రహం దానికి అండగా నిలిచింది. ఆ కోతి విగ్రహాన్ని పట్టుకుని తన ప్రాణాలు రక్షించుకుంది. ఎక్కడ దాన్ని వదిలేస్తే కొట్టుకుపోతాననే భయంతో ఆ కోతి కొన్ని గంటల పాటు అలాగే విగ్రహాన్ని పట్టుకుని ఉండిపోయింది. చివరకు స్థానికులు దాన్ని చూసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఓ పడవలో ఖాకీలు అక్కడికి చేరుకొని కోతిని రక్షించారు.