Social Media: రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనుకుంటున్నారా..? ఇది చదివితే తెలుస్తుంది అసలు కథ..!

Influencer Life: సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు కావాలనే కోరికతో చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నంలో తమ జీవితాలను రిస్క్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరంతరం పర్ఫెక్ట్‌గా కనిపించాలనే తాపత్రయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోటీ తత్వం పెరిగి నిరంతరం వేరేవారితో పోలిక చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు.

Social Media: రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనుకుంటున్నారా..? ఇది చదివితే తెలుస్తుంది అసలు కథ..!
Social Media Influencer

Edited By:

Updated on: Jan 29, 2026 | 6:14 PM

బయటికి కనిపించే గ్లామర్, విలాసవంతమైన ప్రయాణాలు, వేలల్లో లైకులు.. ఇదీ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జీవితం గురించి సామాన్యులకు ఉండే ఊహ. కానీ ఈ రంగుల ప్రపంచం వెనుక ఊహించని స్థాయిలో మానసిక ఒత్తిడి దాగి ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరంతరం పర్ఫెక్ట్‌గా కనిపించాలనే తాపత్రయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోటీ తత్వం పెరిగి నిరంతరం వేరేవారితో పోలిక చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. వేరొకరి లైకులు, వ్యూస్ చూసి తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం చేస్తున్నారట. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల అల్గారిథమ్ ఎప్పుడు మారుతుందో తెలియదు. ఒక్కసారి వ్యూస్ తగ్గితే తమ కెరీర్ ముగిసిపోతుందనే ఆందోళన వీరిని నిద్రపోనివ్వడం లేదు. ప్రతి చిన్న విషయానికి నెటిజన్లు చేసే కామెంట్స్, బాడీ షేమింగ్ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. వ్యూస్ కోసం బెడ్ రూమ్ నుంచి బాత్‌రూమ్ వరకు ప్రతిదీ కెమెరా ముందు పెట్టాల్సి రావడంతో.. వారి వ్యక్తిగత జీవితం బహిరంగ చర్చాంశంగా మారుతోంది.

నిపుణులు ఏమంటున్నారు?

మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రంగంలో ఉన్నవారు డిజిటల్ బర్న్ అవుట్‌కు గురవుతున్నారు. నిరంతరం కంటెంట్ క్రియేట్ చేయాలనే ఒత్తిడి వల్ల మెదడు విశ్రాంతి కోల్పోయి, తీవ్రమైన డిప్రెషన్‌కు దారితీస్తోంది. లైకులు, కామెంట్లు అనేవి కేవలం అంకెలు మాత్రమే కాదు, అవి ఇన్‌ఫ్లుయెన్సర్ల మెదడులో డోపమైన్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. అది తగ్గగానే వారు తెలియని శూన్యంలోకి వెళ్ళిపోతున్నారు.

పరిష్కారం ఏంటి?

ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వారంలో కనీసం ఒక రోజు సోషల్ మీడియాకు పూర్తి దూరంగా ఉండాలి.
ఫోన్ వాడే సమయాన్ని తగ్గించుకోవాలి.
ఆన్‌లైన్ ప్రపంచం వేరు, అసలు జీవితం వేరు అనే విషయాన్ని గుర్తించాలి.

పైకి కనిపించే మెరుపులు చూసి మోసపోకుండా, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ మానసిక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే, ఈ వర్చువల్ ప్రపంచం వారి వాస్తవ జీవితాన్ని మింగేసే ప్రమాదం ఉంది.