Watch Video: ఈ వీడియో చూశాక మరోసారి లిఫ్ట్ ఎక్కాలంటే మీ వెన్నులో వణుకు పుడుతుంది

కేవలం 17 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చూస్తే ఎవరైనా వణికిపోతారు. సరైన నిర్వహణ లేకపోతే లిఫ్ట్‌లు ఎటువంటి ప్రమాదాలు తీసుకువస్తాయో ఈ ఘటన తెలియచెబుతుంది.

Watch Video: ఈ వీడియో చూశాక మరోసారి లిఫ్ట్ ఎక్కాలంటే మీ వెన్నులో వణుకు పుడుతుంది
Broken Lift Accident

Updated on: Oct 12, 2022 | 11:30 AM

మీరు ఏదో ఒక సమయంలో లిఫ్ట్ ఎక్కే ఉంటారు. కొంతమంది ఆఫీసుల్లో, అపార్ట్‌మెంట్స్‌లో రోజూ లిఫ్ట్ ఎక్కుతూనే ఉంటారు. బహుళ అంతస్థుల భవనాలలో ఎవరైనా పైన అంతస్తులకు వెళ్లాలన్నా, దిగాలన్నా లిఫ్ట్ చాలా ముఖ్యం. లిఫ్ట్ లేకుండా 10 ఫ్లోర్లు మెట్లు ఎక్కాలంటే.. చాలా కష్టమవుతుంది. ఊబకాయులు అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది.  అయితే ఈ వీడియో చూశాక మాత్రం.. ఇంకోసారి లిఫ్ట్ ఎక్కాలంటే ఒకటికి.. రెండుసార్లు ఆలోచిస్తారు. ఇందుకంటే ఈ ఆటోమెటిక్ మెషీన్లను అన్నిసార్లు నమ్మలేం. లిఫ్ట్‌ ప్రమాదానికి చెందిన ఓ భయానక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన తర్వాత మీ వెన్నులో వణుకు పుడుతుంది.

నిజానికి, ఈ వీడియోలో ఒక రోగి, ఓ ఆస్పత్రి అటెండెంట్.. ఊహించని విధంగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. పేషెంట్ స్ట్రెచర్‌పై పడుకుని ఉన్నాడు. ఇద్దరు ఆసుపత్రి సిబ్బంది అతన్ని లిఫ్ట్ ద్వారా మరో చోటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. డోర్ ఓపెన్ కాగానే ఓ అటెండెంట్ లోపలికి వెళ్లాడు. బయట ఉన్న అటెండెంట్.. రోగి స్ట్రెచర్‌ను లోపలికి అడ్జెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపల లిఫ్ట్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎటువంటి బటన్స్ నొక్కకుండానే.. కిందకు వెళ్లడం ప్రారంభించింది. స్ట్రెచర్ పూర్తిగా లోపలికి వెళ్లకుండానే లిఫ్ట్.. కిందకి వెళ్లిపోయింది.  దీంతో అక్కడే ఉన్న రోగి బంధువుతో పాటు ఆస్పత్రి సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగిందో వీడియోలో చూడండి

ఈ ప్రమాదంలో లిఫ్ట్ లోపల ఉండిపోయిన వారికి ఏమైనా గాయాలు అయ్యాయా అనే విషయంపై సమాచారం రాలేదు.  కాగా ఈ వీడియో చూసిన జనం మాత్రం షాక్‌కు గురవుతున్నారు. సరైన మెయింటనెన్స్ లేకపోతే.. లిఫ్ట్స్ ద్వారా పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఈ ఘటన చెబుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..