Online Shopping: కొత్త ఫోన్ వచ్చిందని తెగ మురిసిపోయాడు.. పార్సిల్‌లో ఉన్న చూసి పరుగో పరుగు.. ఎందుకో మీరే చూడండి మరి..
మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఆన్‌లైన్ ఫ్రాడ్స్ గురించి నిత్యం అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఒకటి ఆర్డర్ చేస్తే.. మరొకటి డెలివరీ చేయడం.. ఆ తరువాత కస్టమర్లకు తాము ఎదుర్కొన్న సమస్యను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వంటివి నిత్యం కోకొల్లలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యలను సదరు కంపెనీల దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కారం అవుతుంది. వారికి కావాల్సిన ప్రోడక్ట్స్‌ను ఒకటి లేదా రెండు రోజుల్లో డెలివరీ చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఎవరూ..
మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఆన్‌లైన్ ఫ్రాడ్స్ గురించి నిత్యం అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఒకటి ఆర్డర్ చేస్తే.. మరొకటి డెలివరీ చేయడం.. ఆ తరువాత కస్టమర్లకు తాము ఎదుర్కొన్న సమస్యను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వంటివి నిత్యం కోకొల్లలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యలను సదరు కంపెనీల దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కారం అవుతుంది. వారికి కావాల్సిన ప్రోడక్ట్స్‌ను ఒకటి లేదా రెండు రోజుల్లో డెలివరీ చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఎవరూ పరిష్కరించలేని సమస్య వచ్చి పడింది. వచ్చిన పార్సిల్‌ను చూసి బాబోయ్ అంటూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదండోయ్.. భారీ భద్రతా సిబ్బంది కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అవును మరి. అతనికి వచ్చిన పార్సిలి అలాంటిది.
ఫోన్ ఆర్డర్ చేస్తే బాంబ్ వచ్చింది..
ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేశాడు. అయితే, అతనికి ఫోన్‌కు బదులుగా పార్సిల్‌లో బాంబ్ వచ్చింది. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. మెక్సికోలోని గ్వానాజువాటోలో లియోన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ నిర్ణీత సమయానికే అతని ఇంటికి చేరుకుంది. కొత్త ఫోన్ వచ్చిందనే సంబురంలో అతను పార్సిల్‌ను ఇంట్లోకి తీసుకువచ్చి ఓపెన్ చేశాడు. అయితే, పార్సిల్‌లో ఉన్న దానిని చూసి అతని ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ పూర్తిగా మారిపోయాయి. బాబోయ్ అంటూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఎందుకంటే.. ఆ పార్సిల్‌లో స్మార్ట్ ఫోన్ లేదు. దానికి బదులుగా ఓ గ్రనేడ్ బాంబ్ ఉంది. అది చూసి హడలి పోయిన వ్యక్తి.. వెంటనే ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు.
వెంటనే సదరు వ్యక్తి ఇంటికి చేరిన పోలీసులు.. బాంబ్‌స్వ్కాడ్ సహాయంతో బాంబును స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్క్వాడ్ పార్సిల్‌లో వచ్చిన బాంబ్‌ను డిఫ్యూజ్ చేసేసింది. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అయితే, పార్సిల్‌లో బాంబ్ రావడాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఎంక్వైరీ మొదలు పెట్టారు అధికారులు. చట్ట విరుద్ధమైన ఈ పనిని ఎవరు చేశారు? గ్రెనేడ్‌ను ఎవరు పంపారు? వంటి అంశాలపై విచారిస్తున్నారు.
కాగా, సెంట్రల్ మెక్సికోలో అక్రమ ఆయుధాల సరఫరా సర్వసాధారణం అయిపోయింది. ఆ ఫలితంగానే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు అక్కడి జనాలు. కాగా, గత ఆరు సంవత్సరాలుగా గ్వానాజువాటోలో దాదాపు 600 లకు పైగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..