Venkaiah Naidu : ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని వెంకయ్య నాయుడు పిలుపు

|

Jun 05, 2021 | 11:22 AM

ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకం. అందుకోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత..

Venkaiah Naidu : ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని వెంకయ్య నాయుడు పిలుపు
Venkaiah Naidu
Follow us on

Vice President of India M Venkaiah Naidu : ఇవాళ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు మానవ జీవన శైలిలో రావాల్సిన మార్పులను గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశ ఉపరాష్ట్రపతి ప్రజలకు తన సందేశాన్ని వెల్లడించారు. “అందరికీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకం. అందుకోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. సుస్థిర వ్యవసాయ విధానాలను అముపరుస్తూ, అటవీకరణను ప్రోత్సహించడంతోపాటు సముద్ర కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది.” అని వెంకయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇచ్చిన మరో సందేశంలో..

“పర్యావరణానుకూల జీవన విధానాలను పాటిస్తూ, కర్బన ఉద్గారాలను వీలైనంత మేర తగ్గించుకోవడంపైనా మనమంతా దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ఈ సందర్భంగా భవిష్యత్ తరాలకు జీవనానుకూల వాతావరణాన్ని అందించేందుకు మనమంతా కంకణబద్ధులమవుదాం. #WorldEnvironmentDay” అంటూ వెంకయ్య పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ట్విట్టర్ సంస్థ అనూహ్యంగా వెంక‌య్య‌నాయుడు వ్యక్తిగత ట్విట్ట‌ర్ హ్యాండిల్ కు ఉన్న బ్లూ టిక్‌ ను తొలగించింది. అయితే, అధికారిక భారత ఉప‌రాష్ట్ర‌తి ట్విట్ట‌ర్ హాండిల్‌కు మాత్రం బ్లూ మార్క్ అలాగే కొన‌సాగిస్తోంది. వెంక‌య్య నాయుడు వ్యక్తిగత ట్విట్ట‌ర్ ఖాతా కొన్ని రోజులుగా క్రీయాశీల‌కంగా లేద‌ని అందుకే ట్విట్ట‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌నే వాద‌న వినిపిస్తోంది. కొన్ని నెల‌లుగా క్రియాశీల‌కంగా లేని అకౌంట్‌ల‌కు వెరిఫైడ్ బ్లూ టిక్‌ను తొలగిస్తామ‌ని ట్విట్ట‌ర్ త‌న నియ‌మ‌నిబంధ‌న‌లో తెలిపింది. అయితే, ఉపరాష్ట్రపతి కార్యాలయ లేఖ మేరకు మళ్లీ ట్విట్టర్ తొలగించిన కొన్ని గంటల్లోనే బ్లూ టిక్ మార్కును వెంకయ్యనాయుడి ట్విట్టర్ ఖాతాకు కేటాయింది.

Read also : Palaniswami : పన్నీర్ సెల్వంతో విభేదాలు లేవు.. శశికళ, ఆమె ఫ్యామిలీకి ఎఐఎడిఎంకె లో చోటు లేనేలేదు. తేల్చి చెప్పిన అగ్రనేత