Snakes: ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కాపురానికి పామును కూడా పంపుతారు.. వీటితో ఏంచేస్తారంటే?

ప్రపంచంలో ఎక్కడైనా కొత్తళ్లుడికి కట్నంగా ఏ నగో నట్రో లేదంటే వారి స్థోమతను బట్టి ధనమో కట్నంగా ఇస్తారు. కానీ, మనదేశంలోని ఈ ప్రాంతంలో మాత్రం విష సర్పాలను అమ్మాయితో పాటు కాపురానికి పంపుతారు. ఒక వేళ ఇలా కాపురానికి వెళ్లిన పాము మరణిస్తే పెద్ద తతంగమే చేస్తారట. ఆ కుటుంబమంతా దుఖః సాగరంలో మునిగిపోతారట. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది..

Snakes: ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కాపురానికి పామును కూడా పంపుతారు.. వీటితో ఏంచేస్తారంటే?
Snakes As Dowry For Groom In India

Updated on: Apr 22, 2025 | 5:26 PM

వరకట్నం అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక దురాచారం. ఇది ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంగా మారుతోంది. కట్నం కోసం భార్యలను వేధించే పురుషులు నేటికీ ఉన్నారు. అయితే, మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో వరకట్నం విషయంలో చాలా వింత ఆచారాలు కొనసాగుతున్నాయి. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గౌరియా అనే ఒక ప్రత్యేక సామాజిక వర్గం ఉంది. ఈ వర్గంలో పెళ్లిళ్లలో వరకట్నం ఇచ్చే పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ, ఆడపిల్లల తల్లిదండ్రులు తమ అల్లుడికి డబ్బు, నగలు లేదా విలువైన బహుమతులు ఇవ్వడానికి బదులుగా ఏకంగా 21 విషపూరితమైన పాములను కట్నంగా ఇస్తారు. ఈ సంఖ్యను వారు కేవలం కట్నంగా భావించరు. ఒకవేళ ఈ పాములను ఇవ్వకపోతే తమ కుమార్తె యొక్క వైవాహిక జీవితం విచ్ఛిన్నమవుతుందని గట్టిగా నమ్ముతారు.

గౌరియా ప్రజల ప్రధాన వృత్తి పాములను పట్టడం. ఇది వారికి జీవనోపాధినిచ్చే ముఖ్యమైన మార్గం. వారు పాములను ప్రదర్శిస్తూ డబ్బు సంపాదిస్తారు. ఈ సామాజిక వర్గంలో ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలో, కేవలం పాములను మాత్రమే బహుమతిగా ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. తమ కుమార్తెకు భోజనం మరియు నీటి విషయంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదని వారు ఈ వింత ఆచారాన్ని పాటిస్తారు. అందువల్ల, అల్లుడికి వరకట్నంగా పాములను ఇవ్వడం ద్వారా, అతను వాటిని ప్రదర్శిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోగలడని వారు విశ్వసిస్తారు. పెళ్లి నిశ్చయమైన వెంటనే, వధువు తండ్రి కట్నం కోసం పాములను పట్టడం మొదలుపెడతాడు.

గౌరియా ప్రజలు పాటించే ఈ ప్రత్యేకమైన ఆచారంలో ఎక్కువగా విషపూరితమైన పాములనే ఇస్తారు. ముఖ్యంగా గహువా మరియు డోమీ వంటి అత్యంత ప్రమాదకరమైన జాతుల పాములను ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ పాములు కాటేస్తే మనిషి వెంటనే చనిపోతాడు. వారు తమ పెళ్లిలో ఇచ్చిన పాములను తమ ఇంటి సభ్యుల వలె భావిస్తారు. ఒకవేళ వారి ఇంట్లో ఆ పాము చనిపోతే, ఆ కుటుంబ సభ్యులందరూ పశ్చాత్తాపంతో తల గొరిగించుకుంటారు. అంతేకాకుండా, చనిపోయిన పాము పేరు మీద సంతాప విందును కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకే వారు ఈ పాములకు ఎంతో శ్రద్ధగా పరిరక్షిస్తారు.