AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి మొక్కకు ఇది ఒక స్పూన్ వేసి చూడండి.. గుబురుగా, పచ్చగా పెరుగుతుంది

ప్రజంట్ సీజన్‌లో తులసి మొక్క ఎండిపోకుండా, ఆకులు రాలిపోకుండా పచ్చగా, గుబురుగా పెంచేందుకు సరైన జాగ్రత్తలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త మొక్కలు, రీపాటింగ్, కత్తిరింపులతో పాటు... తగినంత సూర్యరశ్మి, నీరు అందిస్తూ, ఇంట్లో తయారుచేసిన ఎరువుతో మీ తులసిని ఆరోగ్యంగా ఉంచుకోండి.

తులసి మొక్కకు ఇది ఒక స్పూన్ వేసి చూడండి.. గుబురుగా,  పచ్చగా పెరుగుతుంది
Tulsi Plant Care
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2026 | 4:16 PM

Share

తులసి మొక్క హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదిగా, ఔషధ గుణాలు కలిగినదిగా పూజించబడుతుంది. అయితే, ప్రజంట్ సీజన్‌లో తులసి మొక్కల సంరక్షణ చాలామందికి సవాలుగా మారుతుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మారిపోవడం,  వాతావరణ మార్పుల కారణంగా మొక్కలు ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం సాధారణం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, మొక్క పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.

ఆకుపచ్చని పువ్వులను తొలగించండి: మొక్క పువ్వులు పూర్తిగా ఎండకుండా, పచ్చగా ఉన్నప్పుడు వాటిని తొలగించండి. మొక్క పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం (వర్షాకాలం, వేసవి) ఉన్నప్పుడు మాత్రమే పువ్వులను తొలగించవచ్చు.

నీటిపారుదల: ఈ సీజన్‌లో తులసి మొక్కకు ఎక్కువ నీరు ఇవ్వకూడదు. అలాగని మట్టి పూర్తిగా ఎండిపోయేలా వదిలేయకూడదు. మట్టి తేమగా, తడిగా ఉండకుండా చూసుకోవాలి. మట్టి కొద్దిగా ఆరిన తర్వాతే నీరు పోయాలి. అధిక నీటిపారుదల వల్ల వేర్లు కుళ్ళిపోయి, ఫంగస్ ఏర్పడి మొక్క ఆకులు రాలిపోవచ్చు. అందుకే మొక్క వేర్ల వద్ద ఎక్కువ నీరు నిలవకుండా చూసుకోవాలి.

మట్టి సంరక్షణ: మొక్క కుండీలో పిచ్చి మొక్కలు, గడ్డి, రాలిపోయిన ఆకులు ఉంటే ఎప్పటికప్పుడు తొలగించాలి. కనీసం వారానికి లేదా పది రోజులకు ఒకసారి మట్టిని బాగా కలుపుకోవాలి (డిగ్గింగ్). ఇలా చేయడం వల్ల వేర్లకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి, మొక్క వేర్లు ఆరోగ్యంగా ఉంటాయి. వేర్లు ఆరోగ్యంగా ఉంటేనే మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

కిరణజన్య సంయోగక్రియ: ఆకులు రాలిపోవడం వల్ల మొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఇది మొక్క బలహీనపడి ఎండిపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి,  ఆకులు రాలకుండా జాగ్రత్త వహించడం మంచిది.

తులసి మొక్క కోసం ఇంట్లో తయారుచేసిన ఎరువులు:

తులసి మొక్కకు సరైన పోషకాలు అందించడం చాలా అవసరం. రెండు రకాల ఇంటి చిట్కాలతో ఎరువులను తయారు చేసుకోవచ్చు:

1. ద్రవ ఎరువు:

కావలసినవి: కౌడంగ్ కంపోస్ట్ (ఆవుపేడ) లేదా వర్మీ కంపోస్ట్, ఎండిన అరటి తొక్కలు (పౌడర్), అర టీస్పూన్ పసుపు పొడి.

తయారీ: ఒక కప్పు కౌడంగ్ కంపోస్ట్/వర్మీ కంపోస్ట్, ఒక కప్పు ఎండిన అరటి తొక్కల పొడి, అర టీస్పూన్ పసుపు పొడిని కలిపి ఒక లీటరు నీటిలో 24 నుండి 48 గంటల పాటు నానబెట్టాలి.

వాడకం: నానబెట్టిన తర్వాత, ద్రావణాన్ని వడకట్టాలి. వడకట్టిన ద్రవంలో ఒక భాగం ఎరువుకు మూడు భాగాలు నీటిని కలిపి మొక్కకు అందించాలి. వడకట్టిన తర్వాత మిగిలిన ఘనపదార్థంలో మళ్లీ నీరు కలిపి రెండోసారి కూడా ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ ఎరువును నెలకొకసారి లేదా 15 రోజులకోసారి, మట్టి తేమ లేకుండా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. పసుపు పొడి పెస్ట్ అటాక్ నుండి మొక్కను రక్షిస్తుంది.

2. ఘన ఎరువు:

కావలసినవి: ఎండబెట్టి పొడి చేసిన అరటి తొక్కల పొడి, అర టీస్పూన్ పసుపు పొడి.

తయారీ: అరటి తొక్కలను బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని చాలా కాలం నిల్వ చేసుకోవచ్చు.

వాడకం: ఒక స్పూన్ అరటి తొక్కల పొడికి అర టీస్పూన్ పసుపు పొడిని కలిపి మొక్క అంచుల దగ్గర మట్టిలో కలపాలి. ఇది పెస్ట్, ఫంగస్ నుంచి మొక్కను కాపాడి, ఆకులు రాలకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఘన ఎరువును కూడా నెలకొకసారి అందించవచ్చు. ఈ జాగ్రత్తలు, ఇంట్లో తయారుచేసిన పోషకాలను అందించడం ద్వారా మీ తులసి మొక్కకు వచ్చే సమస్యల నుండి రక్షింపబడి, ఆరోగ్యంగా, గుబురుగా పెరుగుతుంది.

Follow Us
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!