విద్యార్థులకు గుడ్‏న్యూస్.. ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల స్కాలర్ షిప్.. చివరి తేదీ ఎప్పుడంటే..

విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వల్ల మధ్యలోనే ఆగిపోయిన మహత్మా జ్యోతిబా పూలె విదేశీ విద్యానిధి పథకాన్ని మళ్లి ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో

విద్యార్థులకు గుడ్‏న్యూస్.. ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల స్కాలర్ షిప్.. చివరి తేదీ ఎప్పుడంటే..
Follow us

|

Updated on: Feb 07, 2021 | 2:59 PM

విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వల్ల మధ్యలోనే ఆగిపోయిన మహత్మా జ్యోతిబా పూలె విదేశీ విద్యానిధి పథకాన్ని మళ్లి ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో పట్టభద్రులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు విదేశాల్లో పీజీ, ఇతర ఉన్నత కోర్సులు చదివేందుకు ఈ పథకం కింద రూ.20 లక్షల సాయం అందిస్తుంది ప్రభుత్వం. అయితే గతేడాది కరోనా వైరస్ ప్రభావంతో నోటిఫికేషన్ వెలువడలేదు. అయితే 2021-21 ఆర్థిక సంవత్సరం కింద ఈ మొత్తం 300 మందికి ఈ స్కాలర్ షిప్ అందించనున్నారు.

ఈ స్కాలర్ షిప్ కోసంఈ పాస్ వెబ్ సైట్ లో ఫిబ్రవరి 4 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌ లో తెలుసుకోవచ్చు.

ఇందుకు కావాల్సిన అర్హతలు.. 1. ప్రతి విద్యార్థి వయసు 35 ఏళ్ళు మించకూడదు. 2. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత పొంది వీసా కలిగి ఉండాలి. 3. కుటుంబ వార్షిక ఆదాయం సుమారు రూ.5 లక్షల లోపు ఉండాలి. 4. ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్, వ్యవసాయం, వైద్య విద్య, నర్సింగ్, సామాజిక శాస్త్రాలు, హ్యుమానిటీస్, ఇతర కోర్సులలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 5. కుల, ఆదాయ, పుట్టిన తేదీ, స్థానికత, ఆధార్, ఈపాస్ గుర్తింపు నెంబర్, పాస్ పోర్టు, బ్యాంక్ పాస్ బుక్ ఇతర ద్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read:

రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. కిసాన్ క్రెడిట్ కార్డు ఇప్పుడు పీఎం కిసాన్ వెబ్‏సైట్‏లో కూడా..