AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. కిసాన్ క్రెడిట్ కార్డు ఇప్పుడు పీఎం కిసాన్ వెబ్‏సైట్‏లో కూడా..

రైతులు వ్యవసాయం కోసం తీసుకునే లోన్ ప్రక్రియ కేంద్రం సులభతరం చేసింది. ఇందుకోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని.. పీఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీంతో అనుసంధానం చేసింది.

రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. కిసాన్ క్రెడిట్ కార్డు ఇప్పుడు పీఎం కిసాన్ వెబ్‏సైట్‏లో కూడా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 06, 2021 | 5:25 PM

Kisan Credit Card: రైతులు వ్యవసాయం కోసం తీసుకునే లోన్ ప్రక్రియ కేంద్రం సులభతరం చేసింది. ఇందుకోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని.. పీఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీంతో అనుసంధానం చేసింది. ఈ రెండింటిని అనుసంధానం చేయడం ద్వారా ఇప్పటి వరకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద 174.96 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించింది. వీటిపై దాదాపు రూ.1,63,627 కోట్ల వరకు లోన్ ఇచ్చినట్లుగా కేంద్రం తెలిపింది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీంలో భాగంగా ఇప్పటివరకు రూ.3 లక్షల వరకు లోన్లు కేవడం 7 శాతం వడ్డీకే లభిస్తాయి. ఇక లోన్‏గా తిసుకున్న డబ్బును ఇచ్చిన టైం లిమిట్‏లోపు చెల్లిస్తే.. 3 శాతం వరకు వడ్డీ తగ్గింపు ఉంటుంది. దీంతో రైతులకు 4శాతం వడ్డీకే లోన్ పొందుతారు. లాక్ డౌన్ సమయంలో రూ. 2 లక్షల కోట్ల ఖర్చు పరిమితితో 2.5 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందులో 25 మిలియన్ కార్డులను రెడీ చేయగా.. వీటి ద్వారా రూ.75 లక్షల మంది రైతులకు కెసీసీ లభిస్తుంది.

2021-22 ప్రవేశ పెట్టిన బడ్జెట్‏లో దాదాపు 16.5 లక్షల కోట్ల వరకు వ్యవసాయ లోన్లను ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా రైతులు సులభంగా లోన్స్ పొందవచ్చు. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులందరు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీంను సద్వినియోగం చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయదారులు ముతక వడ్డీలపై లోన్స్ తీసుకోకుండా.. మనీలెండర్లకు దూరంగా ఉండవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్లు ఉండగా.. పీఎం కిసాన్ స్కీంలో దాదాపు 11 కోట్ల మంది లబ్దిదారులున్నారు.

పీఎం కిసాన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది రైతులకు సంబంధించిన భూమి మరియు వారి బయోమెట్రిక్ రికార్డు మొత్తం కేంద్రప్రభుత్వం దగ్గర ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డు పథకంతో పీఎం కిసాన్ యోజన పథకాన్ని అనుసందానం చేయడం వలన బ్యాంకులు రైతులకు లోన్ ఇవ్వడంలో ఎలాంటి జాప్యం జరగదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి మాట్లాడుతూ.. ఇంతకు ముందు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ తీసుకోవాలంటే చాలా కష్టంతరంగా ఉండేది. కానీ పీఎం కిసాన్ యోజన పథకంతో కెసీసీని అనుసంధానం చేయడం ద్వారా.. కెసీసీ దరఖాస్తు ఫారం పీఎం కిసాన్ స్కీం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. దీంతో కేవలం మూడు సర్టీఫికేట్లు ఉంటే బ్యాంకులు లోన్ ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించాయని తెలిపారు.

కెసీసీకి అవసరమైన సర్టిఫికేట్స్.. లోన్ కోసం అప్లై చేసే వ్యక్తి నిజంగానే రైతా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి అతని రెవెన్యూ రికార్డు అవసరమవుతుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి యొక్క ఆధార్, పాన్ జిరాక్స్‏లతోపాటు.. ఆ వ్యక్తికి ఇతర బ్యాంకులలో ఏవైనా లోన్స్ తీసుకున్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకులు కెసీసీ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేశాయి.

Also Read:

సివిల్ అభ్యర్థులకు గుడ్‏న్యూస్.. గతేడాది మిస్సయినవారికి మళ్లీ ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన యూపీఎస్సీ..