Beauty Tips: పెరుగుతో చర్మానికి అద్భుతమైన మార్పు..! మెరిసే అందం మీ సొంతం..!

పెరుగులో ఉన్న పోషకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగుతో ప్రతి రోజు ఫేస్ ప్యాక్ చేయడం ద్వారా మొటిమలు, మచ్చలు, నలుపు తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు పుల్లటి పెరుగును, పొడి చర్మం ఉన్నవారు తియ్యని మీగడ పెరుగును వాడాలి.

Beauty Tips: పెరుగుతో చర్మానికి అద్భుతమైన మార్పు..!  మెరిసే అందం మీ సొంతం..!
Yogurt Face Pack

Updated on: Jan 26, 2025 | 6:27 PM

పెరుగును మనం తినడానికి, వంటకానికి ఉపయోగించడమే కాకుండా అది మన చర్మానికి కూడా ఎంతో మంచిది. పెరుగులో ఉండే పోషకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మేలు చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు పెరుగుతో ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకోవడం ద్వారా ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు, నలుపు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ పెరుగును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగులోని పోషకాలు

పెరుగులో ప్రొటీన్లు, కేల్షియం, విటమిన్ బి, విటమిన్ డి, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇది ముఖంపై ఉండే మచ్చలను తగ్గించి చర్మాన్ని, శరీరానికి హానికరం కాకుండా సహజంగా శుభ్రపరుస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ కూడా చర్మంలోకి లోతుగా ప్రవేశించి సున్నితమైన చర్మాన్ని అందిస్తుంది.

పెరుగును ఎలా ఉపయోగించాలి..?

చర్మం జిడ్డు అయితే పుల్లటి పెరుగును వాడాలి, దానిలో ఎక్కువ నూనె ఉంటుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. పొడి చర్మం ఉన్న వారు తియ్యని మీగడ పెరుగును వాడటం మంచి ఆప్షన్. పెరుగులోని పోషకాలు అందంగా కనిపించే చర్మాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి.

గోధుమ పిండి, పెరుగు

ఒక చిన్న గిన్నెలో ఒక టీస్పూన్ పెరుగును తీసుకోండి. దానిలో ఒక టీస్పూన్ గోధుమ పిండి కలపండి. గోధుమ పిండి ముఖానికి బ్లీచింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇది ముఖంపై ఉండే నలుపుదనాన్ని తగ్గించి చర్మం ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది. అయితే జిడ్డు చ‌ర్మం ఉన్న వారు ఇందులో నిమ్మ‌ర‌సాన్ని కూడా వేసుకోవ‌చ్చు. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 10-15 నిమిషాలు వెయిట్ చేయండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం, మృత క‌ణాలు తొల‌గిపోయి ముఖం అందంగా మారుతుంది.

పెరుగుతో అందం

పెరుగులోని ప్రాకృతిక లక్షణాలు చర్మంలో డీప్ క్లీనింగ్ చేస్తూ.. చర్మ సమస్యలను తగ్గిస్తాయి. కాంతివంతమైన చర్మం కోసం రోజూ ఈ చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం. పెరుగులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని క్లీన్ చేసి చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు, నలుపుదనాన్ని తగ్గిస్తాయి.