Milhailo Tolotos: 82 ఏళ్ల జీవిత కాలంలో ‘స్త్రీ’ని అస్సలు చూడలేదు.. ఈ వ్యక్తి స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..

మనిషన్నోడు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా స్త్రీ ముఖాన్ని చూసే ఉంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి చరిత్ర తెలిస్తే నోరెళ్లబెడతారు. ఈ వ్యక్తి తన మొత్తం 82 ఏళ్ల జీవితంలో స్త్రీ రూపాన్ని చూడలేదు. అసలు స్త్రీ ఎలా ఉంటుందో కూడా అతనికి తెలియదు. అవును, ఇది నిజంగా నిజం. ఒక వ్యక్తి స్త్రీ ని చూడటకుండా ఉండటం, అసలు ఆ రూపమే తెలియకుండా ఉండటం సాధ్యమేనా? అంటే సాధ్యమే అని ఇతని చరిత్ర చెబుతోంది. స్త్రీ ఎలా ఉంటుందో తెలియని వ్యక్తులు ఉన్నారని చెబితే జోక్‌గా ..

Milhailo Tolotos: 82 ఏళ్ల జీవిత కాలంలో ‘స్త్రీ’ని అస్సలు చూడలేదు.. ఈ వ్యక్తి స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..
Mihailo Tolotos

Updated on: Aug 09, 2023 | 11:25 AM

ఈ లోకంలో స్త్రీ ఎలా ఉంటుందో తెలియని వ్యక్తులు ఉంటారా? అంటే ఛాన్స్ లేదని కళ్లు మూసుకుని చెప్పేస్తారు ఎవరైనా. మనిషన్నోడు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా స్త్రీ ముఖాన్ని చూసే ఉంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి చరిత్ర తెలిస్తే నోరెళ్లబెడతారు. ఈ వ్యక్తి తన మొత్తం 82 ఏళ్ల జీవితంలో స్త్రీ రూపాన్ని చూడలేదు. అసలు స్త్రీ ఎలా ఉంటుందో కూడా అతనికి తెలియదు. అవును, ఇది నిజంగా నిజం. ఒక వ్యక్తి స్త్రీ ని చూడటకుండా ఉండటం, అసలు ఆ రూపమే తెలియకుండా ఉండటం సాధ్యమేనా? అంటే సాధ్యమే అని ఇతని చరిత్ర చెబుతోంది. స్త్రీ ఎలా ఉంటుందో తెలియని వ్యక్తులు ఉన్నారని చెబితే జోక్‌గా భావిస్తారు కానీ, ఇది నిజం. అయితే, ఆ వ్యక్తి ఇప్పటి కాలం వ్యక్తి కాదు. 1856 సంవత్సరానికి చెందని వ్యక్తి. గ్రీస్ దేశానికి చెందిన ఈ వ్యక్తి తన 82 ఏళ్ల జీవిత కాలంలో స్త్రీ ముఖాన్నే చూడలేదు. ఇది ఎలా సాధ్యమైందో తెలియాలంటే.. ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ చదవాల్సిందే మరి.

లాడ్‌బిబుల్ నివేదిక ప్రకారం.. మిహైలో టోలోటోస్ అనే వ్యక్తి 1865లో గ్రీస్‌లోని హల్కిడికిలో జన్మించాలి. అయితే, అతను పుట్టగానే తల్లి కన్నుమూసింది. దాంతో అతను అనాథగా మారాడు. మిహైలోను అథోస్ పర్వతంపై ఉన్న ఒక మఠంలోని సన్యాసులు దత్తత తీసుకున్నారు. వారే మిహైలోను పెంచి పోషించారు. అయితే, ఈ మఠం నియమాలు, నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక ఈ మఠం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గుర్తింపు పొందింది.

మహిళలకు అనుమతి లేదు..

మిహైలో నివసించే ఆశ్రమంలోకి మహిళల ప్రవేశం నిషేధించబడింది. ఈ వింత నియమం మఠంలో ఇప్పటికీ వర్తిస్తుంది. దీని ప్రకారం సన్యాసులు జీవితాంతం అవివాహితులుగా ఉండాలి. అయితే, వీరి ప్రపంచ పర్యటనపై ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ మిహైలో తన జీవితమంతా ఆశ్రమానికే అంకితం చేశాడు. 82 ఏళ్ల వయసులో ఆశ్రమంలోనే ఆయన తుది శ్వాస విడిచాడు. అందుకే మిహైలో తన జీవితం మొత్తంలోనూ స్త్రీ ముఖాన్ని చూడలేదు.

మఠంలోని సన్యాసులు ఏం చెప్పారలంటే..

అయితే, మహిళలు ఇలా ఉంటారని తోటి సన్యాసులు చెబితే మాత్రమే మిహైలోకి తెలుసు. కానీ, అతని మొత్తం జీవితంలో ఏ స్త్రీ ని కూడా చూడలేదు. ఏ స్త్రీ కూడా అతనికి ఎదురు పడలేదు. మఠంలోని సన్యాసులు ఇదే విషయాన్ని వెల్లడించారు మిహైలోకు అసలు స్త్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదని అన్నారు. అంతేకాదండోయ్.. అతని జీవితం కాలం మొత్తంగా కారు, విమానాన్ని కూడా చూడలేదు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..