IRCTC Appointment Fake : IRCTC విడుదల చేసిన ఆ నోటిఫికేషన్ ఫేక్.. నిర్ధారించిన PIB ఫాక్ట్.. ఒక్కసారి గమనించండి..
IRCTC Appointment Fake : IRCTC యొక్క నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది.. ఏ నియామక ప్రక్రియ అయినా దాని అధికారిక వెబ్‌సైట్ ద్వారా

IRCTC Appointment Fake : IRCTC యొక్క నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది.. ఏ నియామక ప్రక్రియ అయినా దాని అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే విడుదల చేస్తుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సిటిసి) పేరిట ‘కమర్షియల్ క్లర్క్’ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. పీఐబీ ఫాక్ట్ ( ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెకింగ్) ఈ విషయం చెక్ చేసి ఫేక్ అని నిర్ధారించింది. IRCTC ఎటువంటి నోటిఫికేషన్, అపాయింట్ మెంట్ లెటర్స్ విడుదల చేయలేదని ప్రకటించింది.
IRCTC యొక్క నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది మరియు దరఖాస్తులను ఆహ్వానించడానికి నోటీసు ఎల్లప్పుడూ దాని అధికారిక వెబ్‌సైట్ (www.irctc.com ) ద్వారా మాత్రమే ఉంటుంది. నియామక నోటిఫికేషన్‌లు, వార్తలు జాతీయ / స్థానిక వార్తాపత్రికల్లో, ప్రింట్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తారు. డిసెంబర్ 2019 లో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఫాక్ట్ అని పిలువబడే నిజ-తనిఖీని ప్రారంభించింది. దీని లక్ష్యం “వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చెలామణి అవుతున్న ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని గుర్తించడం.
An appointment letter allegedly issued in the name of Indian Railway Catering & Tourism Corporation Ltd. is claiming that applicant is being appointed for the post of ‘Commercial Clerk’#PIBFactCheck: This letter is #Fake. @IRCTCofficial has not issued this appointment letter pic.twitter.com/kRM5HnuEcj
— PIB Fact Check (@PIBFactCheck) March 22, 2021