Health: గుండెపోటు వచ్చిన వారు పాల పదార్థాలు తీసుకోకూడదా? నిపుణుల మాటేంటంటే..

పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో మరణించడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇక గుండెపోటు బారిన పడి కోలుకున్న వారు కూడా జీవితాంతం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఒక్కసారి హృద్రోగం బారిన పడితే...

Health: గుండెపోటు వచ్చిన వారు పాల పదార్థాలు తీసుకోకూడదా? నిపుణుల మాటేంటంటే..
Heart Attack
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 03, 2024 | 10:29 AM

గుండెపోటు.. ఒకప్పుడు చాలా తక్కువ మందిలో అది కూడా వయసు మళ్లిన వారిలో మాత్రమే ఎక్కువగా కనిపించేది. కానీ ప్రస్తుతం మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృద్రోగాల భారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కరోనా తర్వాత గుండెపోటు బారిన పడిన వారు సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాదు గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది.

పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో మరణించడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇక గుండెపోటు బారిన పడి కోలుకున్న వారు కూడా జీవితాంతం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఒక్కసారి హృద్రోగం బారిన పడితే తర్వాత జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ గుండెపోటు నుంచి కోలుకున్న వారు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటు బారినపడి కోలుకున్న వారు పాలు తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పాలతో తయారయ్యే చీజ్‌, కండెన్సడ్ మిల్క్‌ వంటివాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. వీటివల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు. అలాగే హృద్రోగులు చక్కెరకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. వీటివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇది దీర్ఘకాలంలో గుండె సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.

ఇక గుండెపోటు నుంచి కోలుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సహజంగానే ప్రాసెస్డ్‌ ఫుడ్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీకి కారణమవుతుందని నిపునులు చెబుతున్నారు. అలాగే అధికంగా కొవ్వు ఉండే ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇక హృద్రోగులు ఐస్‌క్రీమ్‌ వంటివి తీసుకోకూడదు. ఇందులోని చక్కెర కంటెంట్‌ ప్రతికూల ప్రభావం చూపుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.