ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిక్ వ్యాధి గ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం 2030 నాటికి 578 మిలియన్ల మందికి.. 2045 నాటికి 700 మిలియన్ల మంది డయాబెటిస్తో ఇబ్బంది పడనున్నట్లు వెల్లడైంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తికి ఇన్సులిన్ సరిగ్గా ఉండదు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీని ప్రభావంతో ఎక్కువగా అలసిపోవడం, గుండె జబ్బులు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. రక్తంలో షూగర్ లెవల్స్ నియంత్రించడానికి డైట్ లో తీసుకునే ఆహారాలు, పానీయాలపై ఆధారపడి ఉంటుంది.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. ఇలా చేస్తే బరువు నియంత్రించడంతోపాటు ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుకోవచ్చు. దీంతో రక్తంలో చెక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.
డయాబెటిస్‌కు కార్బోహైడ్రేట్ల నిర్వహణ చాలా ముఖ్యం. వీరు ఎక్కువగా పిండి పదార్థాలు తినడం వలన, ఇన్సులిన్-ఫంక్షన్ సమస్యలు ఉన్నా.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. తక్కువ కార్బ్ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, రక్తంలో చక్కెర వచ్చే చిక్కులను నివారించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
రోజూ తగినంత నీరు తాగడం వలన రక్తంలో చెక్కర స్థాయిలను సరైన స్తాయిలో ఉంచవచ్చు. అలాగే రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గించడంతోపాటు మూత్రపిండాల ద్వారా చెక్కరను బయటకు పంపిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వలన రక్తాన్ని రీహైడ్రేట్ చేయడానికి.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహయపడతాయి.
ఎక్కువగా ఒత్తిడికి గురయితే అది మీ డయాబెటిక్ పై ఆధారపడిపోతుంది. గ్లోకోగాన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు ఒత్తిడి సమయంలో అధికమవుతాయి. ఈ హార్మోన్లు రక్తంలో షూగర్ లెవల్స్ స్థాయిలను పెంచుతాయి.
మంచి ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా ముఖ్యం. విశ్రాంతి లేకపోవడం వలన రక్తంలో చక్కెర స్తాయిలు, ఇన్సులిన్ సున్నితత్వం కూడా ప్రభావితమవుతాయి. ఇది ఆకలిని పెంచుతున్నాయి. బరువు పెరగడానికి తొడ్పడుతుంది.
ఫైబర్ కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ & చక్కెర శోషణను తగ్గిస్తుంది. అందువల్ల, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా పెంచడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు – పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.
గ్లైసెమిక్ సూచిక ప్రాథమికంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే రేటును ప్రభావితం చేసే ఆహారాలను ఎలా జీర్ణం చేస్తాయో కొలుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ఆహారం ఎలా ప్రభావితం చేస్తుందో మొత్తం, పిండి పదార్థాలు నిర్ణయిస్తాయి. తక్కువ నుండి మితమైన గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలు – బార్లీ, పెరుగు, వోట్స్, బీన్స్ మొదలైనవి.
బరువు నిర్వహణ ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కొలవడం, పర్యవేక్షించడం మీ చక్కెర స్థాయిలను చక్కగా నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. ప్రతిరోజూ మీ స్థాయిలను కొలవడానికి ప్రయత్నించండి, రిజిస్టర్‌లోని సంఖ్యలను ట్రాక్ చేయండి.
రక్తంలో చక్కెర స్థాయి 140 mg / dL కన్నా తక్కువ. రెండు గంటల తర్వాత 200 mg / dL కన్నా ఎక్కువ ఉంటే అది డయాబెటిస్‌ను సూచిస్తుంది.
Also Read: