AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Male Mother: ఈ విశ్వంలో గర్భం దాల్చి.. పిల్లలకు జన్మనిచ్చే ఏకైక మగ జీవి ఏదో తెలుసా?

సాధారణంగా ఆడ జీవులే సంతానానికి జన్మనిస్తాయనేది సృష్టి ధర్మం. మనకు అందరికి తెలిసిన విషయం కూడా అదే. కానీ ఒక జీవి మాత్రం ఈ సృష్టి నియమానికి అతీతంగా ప్రవర్తిస్తుందనే విషయం మీకు తెలుసా?. అవును ఈ విశ్వం మొత్తంలో పిల్లలను జన్మనిచ్చే ఏకైక పురుష జీవి ఇదొక్కటే. ఇంతకూ అదేంటనేగా మీ డౌట్.. అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Male Mother: ఈ విశ్వంలో గర్భం దాల్చి.. పిల్లలకు జన్మనిచ్చే ఏకైక మగ జీవి ఏదో తెలుసా?
The Only Male Animal That Can Get Pregnant
Anand T
|

Updated on: May 11, 2026 | 8:13 AM

Share

సృష్టి నియమాల ప్రకారం కేవలం ఆడ జీవులు మాత్రమే పిల్లలకు జన్మనిస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, అనంతమైన సముద్ర గర్భంలో ఈ నియమానికి అతీతంగా ప్రవర్తించే ఒక వింత జీవి ఉంది. అదే సముద్రపు గుర్రం.. మాతృత్వం అనేది కేవలం ఆడవారికి మాత్రమే పరిమితం కాదని చాటిచెప్పే ఈ జీవి జీవనశైలి ఏదో కల్పిత కథలా అనిపిస్తుంది. మగ జీవి అయినప్పటికీ, ఇది తన గర్భంలో వందలాది పిల్లలను మోస్తూ, ప్రసవ వేదనను అనుభవించి ఈ లోకానికి ఆహ్వానిస్తుంది. ఇవే కాదు మానవులను ఆశ్చర్యానికి గురిచేసే ఎన్నో విషయాలు దీని జీవనశైలిలో భాగమై ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి.

విలక్షణమైన సంతానోత్పత్తి ప్రక్రియ

సముద్రపు గుర్రాల ప్రేమాయణం, సంతానోత్పత్తి విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సంతానోత్పత్తి సమయం వచ్చినప్పుడు, ఆడ, మగ సముద్రపు గుర్రాలు గంటల తరబడి కలిసి ఈదుతూ ఒక రకమైన ప్రేమ నృత్యం చేస్తాయి.ఈ ప్రక్రియ చివరలో ఆడ సముద్రపు గుర్రం తన గుడ్లను మగ గుర్రం పొట్ట భాగంలో ఉండే బ్రూడ్ పౌచ్ అనే సంచి వంటి భాగంలోకి పంపిస్తుంది. గుడ్లు సంచిలోకి చేరిన తర్వాత, మగ సముద్రపు గుర్రం వాటిని ఫలదీకరణం చేస్తుంది. అక్కడి నుండే మగ గుర్రం అసలైన గర్భధారణ కాలం మొదలవుతుంది. ఈ సంచి కేవలం గుడ్లను దాచుకునే చోటు మాత్రమే కాదు, ఇది క్షీరదాల గర్భాశయంలా పనిచేస్తూ గుడ్లకు కావాల్సిన ఆక్సిజన్, పోషకాలు, సరైన ఉష్ణోగ్రతను అందిస్తుంది.

తండ్రి ఒడిలో పిల్లల ఎదుగుదల

సముద్రపు నీటి ఉష్ణోగ్రత, జాతిని బట్టి ఈ గర్భధారణ కాలం రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. ఈ సమయంలో మగ గుర్రం పొట్ట క్రమంగా పెరుగుతుంది. పిల్లలు పూర్తిగా పెరిగిన తర్వాత, మగ సముద్రపు గుర్రం తన శరీరాన్ని సంకోచింపజేస్తూ వందలాది, కొన్నిసార్లు వేల సంఖ్యలో చిన్ని పిల్లలను నీటిలోకి విడుదల చేస్తుంది. ఈ దృశ్యం ప్రకృతిలో అత్యంత అరుదైన, అద్భుతమైన దృశ్యాలలో ఒకటి.

జీవితం మొత్తం ఏకైక భాగస్వామి

సముద్రపు గుర్రాల మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇవి ‘ఏకపత్నీత్వాన్ని’ పాటిస్తాయి. అంటే జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసి ఉంటాయి. మగ గుర్రం గర్భం దాల్చిన సమయంలో కూడా, ఆడ గుర్రం ప్రతిరోజూ వచ్చి తన భాగస్వామిని కలిసి పలకరిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంతటి విస్మయకరమైన జీవులు నేడు వినాశ అంచున ఉన్నాయి. సముద్ర కాలుష్యం, వాతావరణ మార్పులు, అక్రమ వేట వల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

పోస్ట్‌ చూడండి..

View this post on Instagram

A post shared by TheBrainMaze (@thebrainmaze)

ప్రతి ఒక్కరి బాధ్యత

అంతిమంగా ప్రకృతి సృష్టించిన ఈ మగ తల్లిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. తండ్రి బాధ్యతతో పాటు తల్లి మమకారాన్ని కూడా పంచే సముద్రపు గుర్రాల కథ. జీవవైవిధ్యం పట్ల మనకు గౌరవాన్ని పెంచుతుంది. పర్యావరణాన్ని ప్రేమించడం, రక్షించడం ఎంత అవసరమో ఈ వింత జీవి మనకు గుర్తు చేస్తుంది

మరిన్ని హ్యూమన్ ఇంట్రెంస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us