Library: ఆ లైబ్రరీలో పుస్తకం దొంగిలిస్తే తప్పించుకోలేరు.. హైటెక్ నిఘాతో ఇట్టే పట్టేస్తారు

|

Jul 23, 2021 | 11:47 AM

Library: గ్రంధాలయాలు.. విలువైన అవసరమైన పుస్తకాలను భద్రపరిచే దేవాలయాలు. విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను పాఠకులు చదవడం కోసం వీలుగా ఒకదగ్గర చేర్చి ఉంచుతారు.

Library: ఆ లైబ్రరీలో పుస్తకం దొంగిలిస్తే తప్పించుకోలేరు.. హైటెక్ నిఘాతో ఇట్టే పట్టేస్తారు
Library
Follow us on

Library: గ్రంధాలయాలు.. విలువైన అవసరమైన పుస్తకాలను భద్రపరిచే దేవాలయాలు. విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను పాఠకులు చదవడం కోసం వీలుగా ఒకదగ్గర చేర్చి ఉంచుతారు. ఉద్యోగార్థులు తమ కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధం కావలసిన మెటీరియల్ కోసం.. విద్యార్థులు తమకు అందుబాటులో  లేని పుస్తకాలను చదువుకోవడం కోసం.. సాధారణ పౌరులు వార్తాపత్రికల వద్ద నుంచి వార, మాస పత్రికలు లేదా ఇతర పుస్తకాలను చదువుకోవడానికి గ్రంధాలయాలు ఉపయోగపడతాయి. అయితే, కొందరు గ్రంధాలయాల్లోని పుస్తకాలను దొంగతనంగా తీసుకుని పోతుంటారు. కొన్ని గ్రంథాలయాల్లో విలువైన పుస్తకాలు చోరీకి గురైన సంఘటనలు గతంలో చాలా జరిగాయి. ఇన్నిరోజులూ ఇలా దొంగతనంగా బయటకు పోతున్న పుస్తకాలను కాపాడుకోవడం గ్రంథాలయాల నిర్వాహకులకు కత్తిమీదసాములా ఉండేది ఇప్పుడు ఈ దొంగతనాలకు చెక్ పెట్టె టెక్నాలజీ అందుబాటులోకి  వచ్చింది. పూణేలోని ఒక గ్రంధాలయంలో ఈ విధానాన్ని అమలు చేసి పుస్తకాల దొంగల పని పడుతున్నారు.

పూణే గ్రంధాలయ ప్రత్యేకత ఇదీ..

పూణేలోని  లక్ష్మీ రోడ్డులో ఉంది ఈ గ్రంధాలయం. దీనిపేరు పూణే నగర్ వచన్ మందిర్. ఇది ఈ సంవత్సరం నూరేళ్ళ పండగ చేసుకోబోతోంది. ఈ గ్రంధాలయంలో లక్ష పుస్తకాల వరకూ ఉన్నాయి. అదేవిధంగా ఈ గ్రంథాలయానికి నగరంలో ఏడు బ్రాంచ్ లు ఉన్నాయి. అయితే, ఈ గ్రంధాలయంలో పుస్తకాలు చాలా చోరీకి గురి అవుతూ వచ్చేవి. అలా దాదాపు 20 వేలకు పైగా పుస్తకాలు ఆచూకీ దొరకకుండా పోయాయి.  పెద్దదైన ఈ గ్రంథాలయంలో పుస్తకాలు దొంగతనం కాకుండా చూడటం చాలా ఇబ్బందికరంగా మారింది నిర్వాహకులకు. దీంతో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టారు. దీని పేరు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సిస్టం. దీంతో ఇప్పుడు పుస్తకాల దొంగలకు చెక్ పెడుతున్నారు గ్రంథాలయ నిర్వాహకులు.

ఇదెలా పనిచేస్తుందంటే..

ఆర్ఎఫ్ఐడీ (RFID) అనేది వైర్‌లెస్ సిస్టమ్. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ట్యాగ్‌లు, రీడర్‌లతో ఉంటుంది. ట్యాగ్‌లు అనేక రకాల సమాచారాన్ని నిల్వ చేయగలవు. పుస్తకాలలో వీటిని ఉంచుతారు. రీడర్ లను ఎగ్జిట్ గెట్ వద్ద ఉంచుతారు. పుస్తకాన్ని మార్చడానికి ఒక సభ్యుడు లైబ్రరీకి వచ్చినప్పుడు, పుస్తకం తిరిగి రావడం వ్యవస్థ ద్వారా నమోదు చేస్టార్. అదేవిధంగా, వారు క్రొత్త పుస్తకాన్ని ఎంచుకున్నప్పుడు, ఈ  వ్యవస్థ కూడా దానిని నమోదు చేస్తుంది. ఎవరైనా ఎక్కువ పుస్తకాలను తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, బీప్ శబ్దంతో  లైబ్రరీ అధికారులను హెచ్చరిస్తుంది. ఒకవేళ ఎవరైనా నమోదు చేయని పుస్తకంతో బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే, ఎగ్జిట్ గెట్ వద్ద ఉన్న కెమెరా వ్యక్తి చిత్రాన్ని తీసి లైబ్రరీ ఇ-మెయిల్ చిరునామాకు పంపుతుంది. ఇలా పుస్తకాల దొంగల పని పట్టొచ్చు. ఇక్కడ ఈ విధానం విజయవంతంగా అమలు చేశారు. దీంతో ఇతర ప్రాంతాల్లోని గ్రంథాలయాలు కూడా ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

Also Read: Viral video: షాకింగ్.. చూస్తుండగానే ఎత్తుకు పెరుగుతున్న భూమి.. వీడియో వైరల్..

IBPS RRB Clerk Admit Card 2021: ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ అడ్మిట్‌ కార్డు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..!