Gas Cylinder: ఇళ్లలో ఎల్‌పిజి వాడే ప్రజలకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం ఇవ్వబోతోంది. ఇప్పుడు ఎల్‌పిజిని ఉపయోగించే కస్టమర్‌లు ఏ డిస్ట్రిబ్యూటర్ నుండి గ్యాస్ రీఫిల్ పొందాలో తమకు తామే నిర్ణయించుకోవచ్చు. అంటే, వారు తమకు నచ్చిన గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను ఎన్నుకునే ఎంపిక వారికి దొరుకుతుంది. ఈ సదుపాయానికి ‘రీఫిల్ బుకింగ్ పోర్టబిలిటీ’ అని పేరు పెట్టారు. వచ్చే వారం నుండి దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు. అసలు ఈ ‘రీఫిల్ బుకింగ్ పోర్టబిలిటీ’ అంటే ఏమిటి? దానివలన వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఇంటి నుంచే ఆన్ లైన్ ద్వారా మన గ్యాస్ డిస్ట్రిబ్యుటర్ ను ఎలా మార్చుకోవచ్చు అనే వివరాలు పరిశీలిద్దాం.
ప్రస్తుతం, మనం గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే, మనం కనెక్షన్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ మనకు సిలిండర్‌ను బట్వాడా చేస్తారు. అంటే, మన డిస్ట్రిబ్యూటర్ నుండి గ్యాస్ కనెక్షన్ తీసుకున్న తర్వాత, గ్యాస్ కు సంబంధించిన అన్ని సౌకర్యాలను ఒకే డిస్ట్రిబ్యూటర్ మనకు ఇస్తారు. పంపిణీదారుని మార్చడానికి మనకు అవకాశం లేదు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న ఈ ”రీఫిల్ బుకింగ్ పోర్టబిలిటీ’ పథకం అమలు జరిగితే, మనం కొత్త సిలిండర్‌ను బుక్ చేసినప్పుడు, పంపిణీదారుని ఎన్నుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఆన్ లైన్ లో సిలెండర్ బుక్ చేసుకునే సమయంలో మన ప్రాంతంలోని అందరు పంపిణీదారుల జాబితాను అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ లిస్టులోని పంపినీదారుల పూర్తి వివరాలు రేటింగ్ తో సహా అక్కడ డిస్ప్లే అవుతాయి. వీటిని పరిశీలించి మనకు నచ్చిన పంపిణీదారుని మనం ఎన్నుకునే అవకాశం కలుగుతుంది. అప్పుడు మనం ఎంచుకున్న పంపిణీదారుని నుంచి మనకు గ్యాస్ సిలెండర్ బట్వాడా జరుగుతుంది.
పంపిణీదారు రేటింగ్ అంటే..
మనం గూగుల్‌లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు లేదా శోధించినప్పుడు, మనకు స్టార్ రేటింగ్ కనిపిస్తుంది. ఈ రేటింగ్ ఆ ఉత్పత్తి లేదా సేవ ఎంత మంచిదో చెబుతుంది. 5 స్టార్ రేటింగ్ అంటే ఉత్తమమైనది. అలాగే, 1 స్టార్ అంటే చెత్త అని అర్థం. ఈ విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. అదేవిధంగా, గ్యాస్ పంపిణీదారునికి కూడా రేటింగ్ ఇస్తారు. ఆ పంపిణీదారుని వద్ద దొరికే సౌకర్యాలు..గ్యాస్ పంపిణీ విషయంలో ఆ పంపిణీదారుని రికార్డ్.. ఎంత వేగంగా గ్యాస్ వినియోగదారునికి బట్వాడా చేస్తాడు అనే విధానాలను బట్టి ఈ రేటింగ్ ఇస్తారు. మనం సిలిండర్‌ను బుక్ చేసినప్పుడు, ప్రతి పంపిణీదారు రేటింగ్‌ను కూడా తెలుసుకోగలుగుతాం. దాంతో మనం మన గ్యాస్ కోసం ఉత్తమ పంపిణీదారుని ఎన్నుకోగలుగుతాం.
పంపిణీదారుని ఎన్నుకునే పూర్తి ప్రక్రియ ఇలా..
మొత్తం దేశ ప్రజలకు ప్రయోజనం లభిస్తుందా?
లేదు.. ప్రస్తుతం, ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం దేశంలోని 5 నగరాలను ఎంపిక చేసింది, ఇక్కడ ఈ పథకం ప్రారంభమవుతుంది. వీటిలో చండీగడ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీ ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఈ పథకాన్ని క్రమంగా ఇతర నగరాల్లో కూడా ప్రారంభించవచ్చు.
పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఈ పథకాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. రాంచీలోని ఒక డిస్ట్రిబ్యూటర్ చెబుతున్న ప్రకారం, వచ్చే వారం నుండి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో సిలిండర్లను బుక్ చేసే పద్ధతి కూడా మారుతుందా?
లేదు.. పంపిణీదారుని ఎన్నుకోవడం మినహా సిలిండర్ బుక్ చేసే మొత్తం ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండదు.