Monsoons : జూన్ నెలలో భారతదేశానికి సాధారణ వర్షపాతం వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఈ రోజు తెలిపింది. ఈ ఏడాది దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. మధ్య భారతదేశంలో రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాధారణం, ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉంటాయని రాష్ట్ర-భారత భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కాలానుగుణ (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) వర్షపాతం 96 నుంచి104 శాతం నమోదవుతుంది. కేరళలో రుతుపవనాలు జూన్ 3 న వచ్చే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు శ్రీలంక మీదుగా వెళుతున్నాయని రెండు రోజుల తర్వాత కేరళ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 1 న ప్రారంభమయ్యే రుతుపవనాలు వేసవి పంటలకు కీలకమైనవి భారతదేశ వార్షిక వర్షపాతంలో 70% నమోదు కావాలి. ఇది దేశ వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనది. భారతదేశ జనాభాలో దాదాపు సగం వ్యవసాయ ఆధారిత జీవనోపాధిపై ఆధారపడి ఉంటుందన్న విషయం అందరికి తెలుసు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు జూన్ 12 నాటికి రుతుపవనాలు వచ్చే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ సారి అధునాత సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అంచనాలను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న మల్టీ-మోడల్ ఎన్‌సాంబెల్ (ఎంఎంఈ)ను వినియోగించారు. ఈ విధానం వల్ల రుతపవనాలపై అంచనాల్లో లోపాలు దాదాపు తక్కువగా ఉంటాయి. కాగా, గతేడాది దేశవ్యాప్తంగా ఎల్‌పీఏలో 109 శాతం, 2019లో 110 శాతం వర్షపాతం నమోదైంది. ఎల్‌పీఏలో 96 శాతం నుంచి 104 శాతం మధ్య వర్షపాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు.