AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ట్రాక్‌ పక్కన సెల్ఫీలు దిగుతున్నారా.? జైలుకు వెళ్లాల్సిందే..

భారతీయ నిబంధనల ప్రకారం రైల్వే ట్రాక్‌ లేదా ప్లాట్‌ ఫామ్ పక్కన సెల్ఫీలు తీసుకుంటే రూ. 1000 జరిమానా తప్పదు. దీంతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. రైల్వే చట్టం 1989 రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ ప్రాంగణాలకు ఇది వర్తిస్తుంది. రైల్వే చట్టం...

Indian Railways: రైల్వే ట్రాక్‌ పక్కన సెల్ఫీలు దిగుతున్నారా.? జైలుకు వెళ్లాల్సిందే..
Indian Railway
Narender Vaitla
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 25, 2024 | 7:07 PM

Share

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిందే. ఎక్కడ కొత్త ప్రదేశానికి వెళ్లినా వెంటనే జేబులోని స్మార్ట్‌ ఫోన్‌ను తీసి వెంటనే సెల్ఫీలు దిగాల్సిందే. చెట్టు, పుట్ట అనే తేడా లేకుండా సెల్ఫీలకు పోజులిస్తుంటారు. ఇక సోషల్‌ మీడియాలో రాకతో లైక్‌ల మోజులో పడి ప్రాణాలను సైతం రిస్క్‌ చేస్తూ కొందరు ఫొటోలు, రీల్స్‌ చేస్తుంటారు. అయితే రైల్వే ట్రాక్‌ల పక్కన సెల్ఫీలు దిగితే గిన మూల్యం చెల్లించక తప్పదని మీకు తెలుసా.?

భారతీయ నిబంధనల ప్రకారం రైల్వే ట్రాక్‌ లేదా ప్లాట్‌ ఫామ్ పక్కన సెల్ఫీలు తీసుకుంటే రూ. 1000 జరిమానా తప్పదు. దీంతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. రైల్వే చట్టం 1989 రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ ప్రాంగణాలకు ఇది వర్తిస్తుంది. రైల్వే చట్టం 1989 భారతదేశంలోని ప్రతి రైల్వే స్టేషన్‌కు, రైల్వే ట్రాక్‌ల ప్రాంతానికి వర్తిస్తుంది. రైల్వే నిబంధనలను ఉల్లంఘించిన వారికి వివిధ రకాల జరిమానాలు, శిక్షలు చట్టంలో పేర్కొన్నారు.

రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 145, 147ల ప్రకారం రైల్వే ట్రాక్‌లపై ప్రాణాలను రిస్క్‌ చేస్తూ ఫొటోలు దిగితే అది ముమ్మాటికీ శిక్షార్హమైన నేరమేనని చెబుతున్నారు. రైల్వే ట్రాక్ లేదా ప్లాట్‌ఫారమ్ పక్కన సెల్ఫీ తీసుకోవడం శిక్షార్హమైన నేరం. సెల్ఫీ తీసుకుంటూ పట్టుబడితే నిందితులకు రూ.1000 జరిమానా విధిస్తారు. జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు.

ఇదిలా ఉంటే రైల్వే ట్రాక్‌లపై పక్కన సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో చూశాము. ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట ప్రతిరోజూ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. రైల్వేల దగ్గర ఇలా ప్రమాదకర రీతిలో సెల్ఫీలు దిగితే జైలు శిక్ష తప్పదని గుర్తుపెట్టుకోండి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..