ఈ ఛత్తీస్‌గఢ్ రైతు అసామాన్యుడు..! 500 మందికి ఉపాధి క‌ల్పించాడు.. ఇంత‌కీ ఏం చేశాడో తెలుసా..?

| Edited By: Ravi Kiran

Oct 06, 2021 | 6:33 AM

Successful Farmer: కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతార‌నే దానికి ఈ ఛత్తీస్‌గఢ్ రైతు స‌రిగ్గా స‌రిపోలుతాడు. సంక‌ల్పం ఉంటే ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించాడు.

ఈ ఛత్తీస్‌గఢ్ రైతు అసామాన్యుడు..! 500 మందికి ఉపాధి క‌ల్పించాడు.. ఇంత‌కీ ఏం చేశాడో తెలుసా..?
Farme
Follow us on

Successful Farmer: కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతార‌నే దానికి ఈ ఛత్తీస్‌గఢ్ రైతు స‌రిగ్గా స‌రిపోలుతాడు. సంక‌ల్పం ఉంటే ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించాడు. మండల జిల్లాలోని సింగర్‌పూర్ గ్రామానికి చెందిన యువ రైతు సందీప్ లోహన్ బంజరు భూమిలో పచ్చదనం తీసుకొచ్చాడు. 12 సంవ‌త్స‌రాల క్రితం 150 ఎక‌రాల బంజ‌రు భూమిని ఎంచుకొని సాగు ప్రారంభించాడు. అత్యంత క‌ఠిన భూమిని అన్న‌పూర్ణ‌గా మార్చాడు.

150 ఎకరాల బంజరు భూమి
సందీప్ లోహన్ వ్యవసాయం కోసం 150 ఎకరాల బంజరు భూమి ఎంచుకున్నాడు. వ్యవసాయ నిపుణులతో సహా చాలా మంది అతని ఎంపికను త‌ప్పుబ‌ట్టారు. కానీ సందీప్ లోహన్ మొక్క‌వోని ధైర్యంతో సాగు ప్రారంభించాడు. ఇప్పుడు అదే భూమిలో 500 మంది నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించాడు. అంతేకాదు ఈ భూమిలో పండిచంచిన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమ‌తి అవుతున్నాయి. టమోటాలు, పచ్చి మిరపకాయలు, క్యాప్సికం ఎగుమ‌తి చేయ‌డం ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు.

కూరగాయలు, పండ్ల సాగు
సందీప్ తన పొలంలో కూరగాయలు కాకుండా 26 ఆపిల్ చెట్లు నాటాడు. అవి 2019-20లో కొంత పండ్లను ఉత్పత్తి చేశాయి. కానీ 2021 లో ఒక్కో చెట్టు 300 నుంచి 400 కిలోల పండ్లను ఉత్పత్తి చేశాయి. ఎకరం టొమాటో పంట 80 నుంచి 100 టన్నులు, క్యాప్సికమ్ 70 టన్నులు, పచ్చి మిరప 40 టన్నులు, చేదు గుమ్మడికాయ 15 టన్నులు, పొట్లకాయ 40 టన్నులు ఇవి కాకుండా, నిమ్మ, కలబంద మొదలైనవి సాగు చేశాడు. ఇత‌ని నర్సరీలో మొక్కలు స్వయంగా తయారు చేస్తారు.

సాంకేతిక పరిజ్ఞానం
సందీప్ లోహన్ ఫామ్ హౌస్ మండల జిల్లా కాకుండా, దామోహ్, హర్దా, సాగర్ వంటి జిల్లాల్లో ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రదేశాలను సందర్శించడం ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, NGO అధికారులు వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని వెళుతారు. అతని ఫామ్ హౌస్‌లో 500 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. సందీప్ లోహన్ సంపాదనలో ఎక్కువ భాగం ఉద్యాన పంటల ద్వారా వస్తుంది. వాటిని అమ్మడం ద్వారా అతను ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు సంపాదిస్తాడు. లాక్ డౌన్ సమయంలో, అతను మండల, డిండోరి జిల్లాలకు చెందిన 5000 నిరుపేద కుటుంబాలకు రోజువారీ ఉచిత కూరగాయలు అందించి మాన‌వ‌త్వం చాలటుకున్నాడు. అంద‌రు అతని సేవను అభినందించారు.

Samantha: విడాకుల తర్వాత సమంత ఉండబోయేది అక్కడే..! స్పష్టం చేసిన సామ్..