Telangana: ఆ ఊళ్ళో నాన్ వెజ్ ప్రియులకు అసలైన ఉగాది.. ప్రధాన వీధులలో సీమ పందితో రోడ్ షో

|

Apr 09, 2024 | 9:23 AM

పుర్రెకో బుద్ధి.. జివ్వాకో రుచి అంటే ఏంటో.. ఆ గ్రామంలో ఉగాది పర్వదినాన జరిగే ఈ విచిత్ర ఘటన చూస్తే అవాక్కవ్వాల్సిందే..! ఉగాది రోజు చుక్కా - ముక్కాతో ఫుల్ హ్యాపీగా గడిపితే, ఏడాదంతా పండగే అనేది వారి నమ్మకం. అక్కడ ఉగాది పర్వదినాన సీమ పంది మాంసం ఫుల్ ఫేమస్.. మరి ఆ సీమ పందిని ఎక్కడి నుండి తీసుకొస్తారు..? బలిచ్చే ముందు ఏం చేస్తారో మీరే తెలుసుకోండి.

Telangana: ఆ ఊళ్ళో నాన్ వెజ్ ప్రియులకు అసలైన ఉగాది.. ప్రధాన వీధులలో సీమ పందితో రోడ్ షో
Pig Road Show
Follow us on

పుర్రెకో బుద్ధి.. జివ్వాకో రుచి అంటే ఏంటో.. ఆ గ్రామంలో ఉగాది పర్వదినాన జరిగే ఈ విచిత్ర ఘటన చూస్తే అవాక్కవ్వాల్సిందే..! ఉగాది రోజు చుక్కా – ముక్కాతో ఫుల్ హ్యాపీగా గడిపితే, ఏడాదంతా పండగే అనేది వారి నమ్మకం. అక్కడ ఉగాది పర్వదినాన సీమ పంది మాంసం ఫుల్ ఫేమస్.. మరి ఆ సీమ పందిని ఎక్కడి నుండి తీసుకొస్తారు..? బలిచ్చే ముందు ఏం చేస్తారో మీరే తెలుసుకోండి.

ఇదీ ములుగు జిల్లాలోని వెంకటాపురం మండల కేంద్రం. ఇక్కడ ప్రతిఏటా ఉగాది పండుగ వెరైటీగా జరుగుతుంది. ఈ పండుగ పూట నాన్ వెజ్ ప్రియులు సీమ పంది మాంసం భుజించడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉగాదిని పురస్కరించుకుని వ్యాపారులు విజయవాడ గన్నవరం ప్రాంతం నుండి బలిష్టమైన, ఆరోగ్యకరమైన సుమారు 100 కిలోలకు పైగా బరువు ఉన్న సీమ పందిని తీసుకొచ్చారు. పండగ రోజు మాంసం విక్రయించే ముందు గ్రామంలోని ప్రధాన వీధులలో సీమ పందితో రోడ్ షో నిర్వహించారు.

ఉగాది పండుగ రోజు కొంతమంది మాంసాహారులు సీమ పంది మాంసం ప్రియులు అభ్యర్థన మేరకు విజయవాడ గన్నవరం ప్రాంతం నుండి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు వ్యాపారులు. బలిష్టమైన సీమ పంది మాంసం నాన్ వెజ్ ప్రియులు అందరూ చూసే విధంగా దానికి బొట్లు బెట్టి వీదుల్లో తిప్పారు.

సీమ పందితో మాంసం ప్రతి ఉగాది పండుగ పూట ఇక్కడ ఆనవాయితీ గా కొనసాగుతుంది. అయితే కిలో మాంసం 400 రూపాయలకు విక్రయిస్తున్న వ్యాపారులు సీమ పంది మాంసం ప్రియులను ఆకర్షించేందుకు ముందు ఇలా ప్రదర్శన నిర్వహించారు. దీంతో నాన్ వెజ్ ప్రియులకు పండుగ పూట నోరు ఊరుతోంది. కానీ శాకాహారులు మాత్రం పండుగ పూట పంది రోడ్ షో ఏంటని ముక్కున వేలేసుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…