Sri Rama Navami 2021: త్రేతాయుగంలోని వసంత రుతువు రుతువు చైత్ర శుద్ధ నవమి, నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని నమ్ముతుంటారు. ఈరోజు (ఏప్రిల్ 21) శ్రీరామ నవమి. ఈరోజున రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నవమి రోజున భక్తులు అయోధ్యకు దేశంలోని వివిధ ప్రాంతాల నంచి వస్తారు. ఈ రోజు భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్యాణం ఎంతో పేరుగాంచింది. నవనినాడు శ్రీ రాముడి మంత్రాలను పఠించడం వల్ల అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకం. సంపదతో పాటు ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. మరీ ఈ శ్రీరామ నవమి రోజున మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలపండిలా. మీకోసం కొన్ని అందమైన విషెస్.
** శ్రీరామ రామ రామేతి..
రమేరామేమనోరమే..
సహస్రనామ తత్తుల్యం..
రామనామ వరాననే..
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
** శుభప్రదమైన శ్రీరాముని జన్మదినం..
శ్రీరామనవమి..
మీకు శుభకరం ఆనందకరం కావాలని ఆశిస్తున్నాను..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
**పట్టాభి రామునికి ప్రియవందనం..
అయోధ్య రామునికి అభివందనం..
పాపవిదూరునికి జయవందనం..
అందాల దేవునికి మదిమందిరం..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
**శ్రీ రాఘవం దేశ దశాత్మజ ప్రమేయం..
సీతాపతిం రఘు కలాస్వయ..
రత్నదీపమ్ రజామబాహుమరవింద
దళత్పక్షమ రామం విశాల్
వినాశికరం నమామి..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
** శుద్దబ్రహ్మ పరాత్పర రామా..
కాళాత్మక పరమేశ్వర రామా..
శేసతల్ప సుఖనిద్రత రామా..
బ్రహ్మధ్యామర ప్రార్థిత రామ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
** రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్..
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
** ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం..
వైదేహీ హరణం జటాయ మరణం సుగ్రీవనమ్భాషణం..
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపూరీ దాహనం..
పశ్చాద్రావణ కుంబర్ణ హననం యేతద్ది రామాయణం..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
Also Read: Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..
ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్… ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..