Sonu Sood – Mekapati Goutham Reddy – Nagalakshmi : నెల్లూరుజిల్లా ఆత్మకూరులో సోనూసూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో కలిసి దివ్యాంగురాలు నాగలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఇటీవల నటుడు సోనూసూద్ రూ. 1.50 కోట్లతో నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ అందించారు. అయితే, ఇదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి అనే దివ్యాంగురాలి చేత ఈ ఆక్సిజన్ ప్లాంటు ప్రారంభించాలంటూ సోనూసూద్ ఇక్కడి అధికారులను కోరడంతో నాగలక్ష్మి చేత ఈ ప్లాంటు ను ప్రారంభించారు.
గతంలో సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభావితురాలైన నాగలక్ష్మి తన ఐదు నెలల ఫింక్షన్ ను సోను సూద్ ట్రస్ట్ కి ఇవ్వడం తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లో సోనూసూద్ సోషల్ మీడియా వేదికగా నాగలక్ష్మిను అభినందించారు.. ఇక, తాజాగా సోనూసూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ను నాగలక్ష్మి చేతులు మీదుగా ప్రారంభించాలని సోనూసూద్ కోరడం విశేషం.
Really proud to announce that Buda Nagalakshmi, the blind girl who donated her 5-month pension of Rs 15000 to @SoodFoundation will be inaugurating our oxygen plant in Andhra on July 23 at 11:15 am.
Sri Goutham Reddy, Minister IT
Sri Chakradhar Babu,DC will be present.
Jai Hind?? pic.twitter.com/oJ9Z6b6kVh— sonu sood (@SonuSood) July 22, 2021
Read also : Road accident : నాగర్ కర్నూలు జిల్లా చెన్నారం గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం