Social Mindfulness: ప్రపంచ దేశాల్లో సామాజిక బుద్ధి ప్రదర్శించడంలో భారత్ స్థానం తెలిస్తే షాక్ అవుతారు!

|

Sep 10, 2021 | 7:36 PM

మీకు ఎప్పుడైనా రైల్వే స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీ నుండి నీరు చిమ్మి తడిచిపోయిన అనుభవం ఎదురైందా? అదీ వర్షం లేకుండా.. చాలా మందికి ఇది అనుభవమే.

Social Mindfulness: ప్రపంచ దేశాల్లో సామాజిక బుద్ధి ప్రదర్శించడంలో భారత్ స్థానం తెలిస్తే షాక్ అవుతారు!
Social Mindfulness
Follow us on

Social Mindfulness: మీకు ఎప్పుడైనా రైల్వే స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీ నుండి నీరు చిమ్మి తడిచిపోయిన అనుభవం ఎదురైందా? అదీ వర్షం లేకుండా.. చాలా మందికి ఇది అనుభవమే. అకస్మాత్తుగా నీళ్ళు పడి తడిచిపోయిన వెంటనే మీరు కిటికీలోంచి చూస్తే, పక్క సీటులో కూర్చున్న ఎవరైనా కిటికీ వెలుపల చేతులు కడుక్కొని ఉన్నారని, ఇప్పుడు మీ ముఖం ఆ మురికి నీటితో తదిచిపోయిందనీ అర్ధం అవుతుంది. ఏమీ అనలేక ఒకసారి ఓ వెర్రి చూపు చూసి మొహం కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరకు వెళతారు. అంతేనా? నిజానికి మీరు చేసిన పని ఆ చేయి కడుక్కున్న వ్యక్తీ చేయొచ్చు. మన రైల్వేలో చేతులు చేతులు కడుక్కోవడానికి సౌకర్యం లేదని కాదు కదా? ఎవరైనా లేచి బేసిన్‌లో చేతులు కడుక్కోవాలి. కానీ చాలామంది అలా చేయరు. రోడ్డు మీద కారు గ్లాసును తీసి అరటి తొక్కను విసిరేసినా లేదా బిస్కెట్-చాక్లెట్ రేపర్‌ను విసిరినా.. అది భారతీయుల విధానం అని అనిపించేలా చేయడం మన అలవాటు.

చాలాసార్లు, రెండవ-మూడవ అంతస్తులో నివసిస్తున్న ఆంటీ ప్రతిరోజూ ఉదయం సూర్యభగవానుడికి నీటిని అందించడం మర్చిపోదు. ఆ సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఒక వ్యక్తి ఆఫీసుకి వెళ్తుండవచ్చు లేదా ఒక పిల్లవాడు స్కూలుకు వెళ్తుండవచ్చు. కానీ, అదేమీ ఆ ఆంటీకి పట్టదు. ఎందుకంటే, ఆమెకు ఆమె పనే ముఖ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు. ఇవి చాలా వరకూ భారతదేశంలో మాత్రమే ఎదురయ్యే సంఘటనలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుమానం వచ్చిందా. అదే చెప్పబోతున్నాము. వివిధ దేశాల్లో ప్రజల సామాజిక ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయంపై ఒక సర్వే జరిగింది. సామాజిక ప్రవర్తన అంటే ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. అది కొద్దిగా అర్ధం అయ్యేలా చెప్పడం కోసం పై ఉదాహరణలు తీసుకున్నాం. మనకి వ్యక్తిగత ప్రయోజనం ఉంటె తప్ప మనం అపరిచితులు ఇంకా చెప్పాలంటే పక్క వారి గురించి ఆలోచించం. కొద్దిగా కష్టం అయినా ఇక్కడ సందర్భం కాబట్టి ఈ మాట అనక తప్పడం లేదు.. మనలో ఎక్కువ శాతం మంది సామాజిక బుద్ధిహీనులం. ప్రపంచంలో 31 దేశాలలో జరిగిన సామాజిక ప్రవర్తన పై అధ్యయనంలో ఈ విషయం చాలా స్పష్టంగా తేలింది.

సామాజిక ప్రవర్తనలో మన స్కోరింగ్ కేవలం 50 శాతం మాత్రమే. ఒక అమెరికన్ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించి..ఫలితాలు వెల్లడించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో గత వారం ఈ ఫలితాలు ప్రకటించారు. దీని ప్రకారం సామాజిక బుద్ధిలో జపాన్ స్కోరింగ్ 72%. అంటే, వారు ఎటువంటి ప్రయోజనం లేకుండా కూడా 72% సమస్యలపై తెలియని వాటి గురించి ఆలోచిస్తారు. పక్క వారి గురించి ఆలోచిస్తారు. అంటే మనం చేసిన పని వలన పక్కనున్న వారు ఏదైనా ఇబ్బంది పడతారా అనేది వారు పరిగణనలోకి తీసుకుంటారు.

రెండవ స్థానంలో ఆస్ట్రియన్లు 69% కేసులలో సామాజిక బుద్ధిని ప్రదర్శించారు. మూడవ స్థానంలో 68%సాధించిన మెక్సికన్ ఉంది. ఈ జాబితాలో దిగువ ఉన్న దేశాలను పరిశీలిస్తే, ఇండోనేషియా 46% తో అట్టడుగున ఉంది, 47% తో టర్కీ ఆ తర్వాత స్థానంలో ఉంది. ఇక 50% స్కోరింగ్‌తో భారతదేశం దిగువ నుండి మూడవ స్థానంలో కొనసాగుతోంది.

65 మంది పరిశోధకుల అధ్యయనం ఇది..

మొత్తం 65 మంది పరిశోధకుల అంతర్జాతీయ బృందం ఒక ప్రాజెక్ట్ కోసం దేశ స్థాయిలో సామాజిక ప్రవర్తనపై అధ్యయనం చేసింది. అధ్యయనంలో పాల్గొన్న 8,354 వాలంటీర్ల కోసం పరిశోధకులు 12 ఊహాత్మక విషయాలను ఎంపిక చేసి సిద్ధం చేశారు. ఫలితంగా వివిధ దేశాల ప్రజల మధ్య అనేక పెద్ద తేడాలు కనిపించాయి.

సామాజిక బుద్ధి విషయంలో మనం అట్టడుగు స్థానలలో కనిపించడం విచారకరం. ఆధునికత.. ఇతర దేశాలలోని కొత్త కొత్త ఫ్యాషన్ల అనుకరణ.. ఇటువంటి విషయాల్లో ముందుకు దూసుకుపోయే మనం..సామాజిక ప్రవర్తన విషయంలో ఇలా ఉండటం ఇబ్బందికర అంశం.

ఈ అలవాటును మార్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం అవసరం లేదు

మన వలన పక్కవారు ఇబ్బంది పడకూడదు అనే స్పృహ ఎవరికి వారు ఎప్పుడూ మనసులో ఉంచుకుంటే చాలు.. మన సామాజిక బుద్ధి ఆటోమేటిక్ గా టాప్ లోకి వెళ్ళిపోతుంది. దీనికోసం ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. రోజువారీ పనులు చేసేటప్పుడు, మీరు చేసే పనుల వల్ల ఏ ఇతర వ్యక్తి ప్రభావితం కాకూడదని మీరు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, ఏదైనా తిన్న తర్వాత, ఖాళీ ప్యాకెట్ లేదా పై తొక్కను డస్ట్‌బిన్‌లో వేయడం. అదేవిధంగా బహిరంగంగా ఉమ్మి వేయడం వంటి అలవాట్లు మానుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రతలు తీసుకుంటే చాలు. అఖండ భారతావని సంస్కారవంతమైనది అని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మనదే కదా!

Also Read: Underwater Wedding: అడ్వెంచర్ సెంటర్‌లో నీటిలో పెళ్లి చేసుకుని ఒక్కటైన జంట.. వీడియో వైరల్..

Udan Scheme: ఉడాన్ పథకంలో భాగంగా ఐదు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే..