Snake in Scooty: మహిళ స్కూటీలో నక్కిన త్రాచుపాము.. దారిలో వెళ్తుండగా చేతికి మెత్తగా తగలడంతో..

|

Feb 18, 2021 | 10:56 AM

అమరావతి ఉండవల్లి సెంటర్‌లో త్రాచుపాము కలకలం రేపింది. ఓ మహిళ స్కూటీలో దూరిన పాము హంగామా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 

Snake in Scooty:  మహిళ స్కూటీలో నక్కిన త్రాచుపాము.. దారిలో వెళ్తుండగా చేతికి మెత్తగా తగలడంతో..
Follow us on

Snake in Scooty:  అమరావతి ఉండవల్లి సెంటర్‌లో త్రాచుపాము కలకలం రేపింది. ఓ మహిళ స్కూటీలో దూరిన పాము హంగామా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. స్కూటీపై వెళ్తున్న మహిళ రోజూ మాదిరిగానే ఇంటి నుంచి బయల్దేరింది. రోడ్డుపై స్పీడ్‌గా వెళ్తున్న క్రమంలో..ఆమె చేతికి ఏదో తాకుతున్నట్లు అనిపించడంతో..బండి ఆపి చూడగా హెడ్‌లైట్‌లో నక్కిఉన్న పాము కనిపించింది. పాముని చూసిన సదరు లేడీ…ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ పాముని చూసి భయపడి స్కూటీని కిందపడేసింది.

అది గమనించిన స్థానికులు వెంటనే ఆమె వద్దకు చేరుకున్నారు. స్కూటీలో పాము దూరిన విషయం తెలుసుకుని దానిన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు బయటకు వచ్చిన పామును స్థానికులు చంపేశారు.

Also Read:

విచిత్ర వైద్యం.. పసరు మందుతో సంతానం కలుగుతుందని ప్రచారం.. అక్కడికి దంపతుల క్యూ

IPL 2021 Auction: ఐపీఎల్ 2021 ఆక్షన్‌ నేడే.. సమయం, వేదిక, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు