
భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్విసిస్తుంటారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని మనిషి జీవన విధానంలో కూడా వాస్తు ఓ భాగమని వాస్తు పండితులు చెబుతుంటారు. పడుకునే దిశ నుంచి భోజనం చేసే వరకు వాస్తును తప్పకుండా ఫాలో కావాలని చెబుతుంటారు. ఇంట్లో కూర్చొని భోజనం చేసే దిశలో కూడా వాస్తు ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో కుర్చొని తినాలి.? ఏ దిశలో తినడం ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* వాస్తు ప్రకారం, ఆహారం తీసుకునే విషయంలో పశ్చిమను అశుభకరమైందిగా చెబుతారు. పడమర ముఖంగా కుర్చొని భోజనం చేయడం వల్ల అప్పులు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ దిక్కున కూర్చొని ఆహారం తినడం వల్ల ఇంట్లో దారిద్ర్యం వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
* ఆహారం తినేప్పుడు ఉత్తరం, తూర్పు దిశలను మంచివిగా చెబుతుంటారు. ఆహారం తినడానికి దక్షిణం అత్యంత అశుభకరమైన దిశగా చెబుతుంటారు. దక్షిణ దిక్కును యమ దిక్కుగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం, ఈ దిశలో ఆహారం తీసుకోవడం వల్ల మనిషి వయస్సు తగ్గుతుంది, దురదృష్టం కూడా పెరుగుతుంది.
* ఆహారాన్ని ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ తినాలి. ఈ రెండూ మంచి దిశలుగా చెబుతారు. ఈ దిశల్లో కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు.
* వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు ధరించి భోజనం చేయకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడడమే కాకుండా, అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
* స్నానం చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. స్నానం చేయకుండా భోజనం చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
* ఇక ఎట్టి పరిస్థితుల్లో విరిగిన ప్లేట్లలో ఆహారపదార్థాలను తీసుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దారిద్య్రం వెంటాడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..