Propose Day: ప్రేమించిన వారికి ప్రేమను చెప్పలేకపోతున్నారా ?… ప్రపోజ్ డే రోజు ఇలా మీ ఇష్టాన్ని తెలియజేయండి..

వాలంటైన్ వీక్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే రోజ్ డే కూడా అయిపోబోతోంది. నెక్ట్స్ ఏంటని ఆలోచిస్తున్నారా.. టెన్షన్ ఎందుకు బ్రదరూ.. రోజ్ డే తర్వాత ఇంకేముంటుంది. గులాబీలు ఇచ్చిన తర్వాత ప్రపోజ్...

Propose Day: ప్రేమించిన వారికి ప్రేమను చెప్పలేకపోతున్నారా ?... ప్రపోజ్ డే రోజు ఇలా మీ ఇష్టాన్ని తెలియజేయండి..
Propose Day
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 07, 2023 | 9:28 PM

వాలంటైన్ వీక్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే రోజ్ డే కూడా అయిపోబోతోంది. నెక్ట్స్ ఏంటని ఆలోచిస్తున్నారా.. టెన్షన్ ఎందుకు బ్రదరూ.. రోజ్ డే తర్వాత ఇంకేముంటుంది. గులాబీలు ఇచ్చిన తర్వాత ప్రపోజ్ చేయకుండా ఉంటారా.. హా… అదే అదే రోజ్ డే తర్వాత వచ్చేది ప్రపోజ్ డేనే. అయితే మనం ఎలా ప్రపోజ్ చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఇష్టమైన వారిపై మనసులో ఏర్పరుచుకున్న భావాలను మాటల రూపంలో చెప్పడం అంత ఈజీ కాదు. అది కూడా.. ఇష్టమైన వారు ఎదురుగా నిలబడి ఉంటే.. ప్రేమించిన వారికి మన ప్రేమను తెలపడమంటే కాస్త కష్టమే. ఎన్నో సందేహాలు.. భయంతో మాటలు రావు. అందుకే.. ఎలాంటి హైరానా పడకుండా సింపుల్ కొటేషన్స్ తో ప్రపోజ్ చేసేయండి. మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తి ముందు కుమ్మరించేయండి…

ఒకరిని గాఢంగా ప్రేమిస్తున్నా.. చాలా రోజులుగా ప్రపోజ్ చేయాలని ఎదురుచూస్తున్న వారికి ప్రపోజ్ డే మంచి అవకాశం. సమయం వృథా చేయకుండా.. మనసుకు నచ్చిన వ్యక్తికి ప్రపోజ్ చేసేయండి. ఎందుకంటే ప్రపోజ్ డే రోజున ప్రపోజ్ చేసే వాళ్లు ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం స్వయంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇవ్వొచ్చు. కార్డ్‌లో మీ స్వంత ప్రేమపూర్వక పదాలను రాయడం ద్వారా ఐ లవ్ యూ చెప్పి వారి మనసు గెలుచుకోవచ్చు. మోకాళ్లపై కూర్చొని తనకు నచ్చిన బహుమతిని ఇవ్వడం కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. కవిత్వం పాడటం, రొమాంటిక్ పాటలు, గిటార్ వాయించడం ద్వారా కూడా ప్రపోజ్ చేయవచ్చు. వీటితో పాటు ప్రేమపూర్వక సందేశాలను పంపడం ద్వారా ప్రేమను వ్యక్తం చేయవచ్చు.

నా కళ్ల లోతుల్లో దాగి ఉన్న ప్రేమను అర్థం చేసుకో, ఓ ప్రియతమా.. నువ్వు లేకుండా నేను జీవించలేను. ఐ లవ్యూ, నా ఈ అమాయక హృదయం నిన్ను మాత్రమే ప్రేమించాలనుకుంటోంది. నీతో మాత్రమే తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటోంది, ఇలాంటివి గానీ, స్వంత కవిత్వం గానీ యాడ్ చేసి అందంగా ప్రపోజ్ చేయవచ్చు. కాబట్టి ఎలాంటి కంగారు పడకుండా.. ముఖ్యంగా భయపడకుండా మనసుకు నచ్చిన వ్యక్తికి హార్ట్లీ వెల్కమ్ చెప్పేయండి.. ప్రపోజ్ డే ను మరిచిపోలేని జ్ఞాపకంగా మిగుల్చుకోండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి