
వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, పాత్రలు కడిగిన తర్వాత నూనె, సుగంధ ద్రవ్యాల అవశేషాలు, కూరగాయల ముక్కలు అన్నీ సింక్‌లో పేరుకుపోతాయి. దీంతో సింక్ జిగటగా, మురికిగా మారుతుంది. కొంతకాలానికి ఫంగస్, దుర్వాసన వస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.
వేడి నీళ్లు: ముందుగా వేడి నీటితో సింక్‌ను నింపండి. వేడి నీళ్లు నూనె, జిగట మురికిని వదిలిస్తాయి.
బేకింగ్ సోడా, వెనిగర్: నాలుగు చెంచాల బేకింగ్ సోడా, అర కప్పు వెనిగర్, కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు అలాగే వదిలేయండి. దీని మధ్య రసాయన చర్య జరిగి మొండి మరకలు కరిగిపోతాయి.
శుభ్రం చేయడం: ఆ తర్వాత స్పాంజ్‌తో సింక్‌ను సున్నితంగా రుద్దండి. గీతలు పడకుండా ఎక్కువ బలం వాడకుండి. చివరిగా నీటితో కడిగి, పొడి గుడ్డతో తుడిచేయండి. అలా చేస్తే మీ సింక్ కొత్తలా మెరుస్తుంది.
నిమ్మకాయ, ఉప్పు: నిమ్మకాయను మధ్యలో కోసి దానిపై ఉప్పు చల్లి, సింక్‌ను రుద్దండి. నిమ్మకాయలోని ఆమ్లం, ఉప్పు కలిసి మరకలను కరిగిస్తాయి. దుర్వాసనను తొలగిస్తాయి.
పేస్ట్ చిట్కా: బేకింగ్ సోడాతో పేస్ట్ లా చేసి మొండి మరకలపై రాసి, పది నిమిషాల తర్వాత శుభ్రం చేయవచ్చు. వెనిగర్‌ను నీటితో కలిపి సింక్‌లో పోసినా మురికి వదులుతుంది.
ఈ చిన్న చిట్కాలను రాత్రి పడుకునే ముందు పాటిస్తే, ఉదయం మేల్కొన్నప్పుడు మీ సింక్ కొత్తదానిలా మెరిసిపోతుంది. ఇలా చేయడం వల్ల ఫంగస్, బాక్టీరియా దూరమవుతాయి.