Car Driving: రాత్రుళ్లు కారు నడిపిస్తున్నారా.? ముందు ఇవి తెలుసుకోండి..

|

Nov 21, 2024 | 10:26 AM

రాత్రుళ్లు కారు నడిపే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. పగటి సమయంతో పోల్చితే రాత్రుళ్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి కారు నడిపే సమయంలో కొన్ని రకాల చిట్కాలను తప్పకుండా ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Car Driving: రాత్రుళ్లు కారు నడిపిస్తున్నారా.? ముందు ఇవి తెలుసుకోండి..
Car Driving Tips
Follow us on

కారు డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హై ఎండ్ ఫీచర్లతో, క్షణాల్లో వంద స్పీడ్‌ను అందుకునే కార్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రోడ్లపై కార్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. కారు ఎంత వేగంతో వెళ్తుందో కూడా తెలియని విధంగా ఉంటుంది. దీంతో ఏమాత్రం తడబడినా పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే పగలు కారు నడపడం కంటే రాత్రుళ్లు కారు నడపడం కాస్త ఇబ్బందితో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. రాత్రి కారు నడిపే సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రాత్రుళ్లు కారు నడిపే సమయంలో ఎదురయ్యే ప్రధాన సమస్య ఎదురుగా వచ్చే వాహనాలతో ఉంటుంది. ముఖ్యంగా సింగిల్ రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో ఎదురుగా వచ్చే కార్లకు ఇబ్బంది ఎదురవుతుంది. హైబీమ్‌ లైట్స్‌ను ఉపయోగించడం వల్ల ఎదుటి వాహనదారులకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే లోబీమ్‌ లైట్‌లోనే వాహనాన్ని నడిపించాలి.

* ఇక పగటి సమయంతో పోల్చితో రాత్రుళ్లు కచ్చితంగా తక్కువ వేగంతో వెళ్లాలి. రోడ్లపైకి జంతువులు, ప్రజలు ఉన్నపలంగా వచ్చే అవకాశం ఉంటుంది. చీకటిలో వారిని గుర్తించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు రాత్రుళ్లు నెమ్మదిగా వెళ్లాలి.

* రాత్రుళ్లు కారు డ్రైవింగ్ చేసే సమయంలో లోపల లైట్స్‌ ఆన్‌ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. దీని కారణంగా వెనకాల నుంచి వచ్చే వాహనాలను గుర్తించడం ఇబ్బంది అవుతుంది. వెనకాల నుంచి వచ్చే వారు డిప్పర్‌ వేయడాన్ని గుర్తించడం ఇబ్బంది అవుతుంది.

* ఇక రాత్రుళ్లు రోడ్లపై ఉండే గుంతలను గుర్తించడం ఇబ్బంది అవుతుంది. అందుకే లో బీమ్‌ లైట్స్‌ను ఆన్‌ చేసుకొని వెళ్లాలి. దీంతో లైట్‌ రోడ్డుపై పడి, గుంతలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.

* అన్నింటికంటే ముఖ్యంగా రాత్రుళ్లు నిద్రవచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిద్రరాకుండా ఉండేందుకు తరచూ ముఖాన్ని కడుక్కోవడం, టీ తాగడం లాంటివి చేయాలి. అలాగే రాత్రుళ్లు ప్రయాణం చేసే సమయంలో పక్కన కూర్చునే వారు నిద్రపోకుండా ఉండేలా చూసుకోవాలి. పదే పదే మాట్లాడే వారు, కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని అలర్ట్‌ చేస్తుండే వారు ఉండాలి.

* రాత్రుళ్లు జరిగే ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఆగి ఉన్న వాహనాలు ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ముందు కనిపించే వాహనం ముందుకు వెళ్తున్న భావన కలుగుతుంది. అందుకే మన ముందు ఏదైనా వాహనం ఉంటే అలర్ట్‌గా ఉండాలి. వాహనం దగ్గరి వరకు వెళ్లక ముందే ఓవర్‌ టేక్‌ చేయడానికి ప్రయత్నాన్ని ప్రారంభించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..