Schools Reopen: కరోనా కారణంగా భారతదేశంలో పాఠశాలలు గత 15 నెలలుగా మూతపడ్డాయి. ఇది కోట్ల మంది విద్యార్థుల విద్యను ప్రభావితం చేసింది. ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్నప్పటికీ. పిల్లల మెరుగైన అభివృద్ధికి, పాఠశాల వాతావరణంలో నేర్చుకోవడం మరింత ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అలాగే, ఆన్‌లైన్ తరగతుల వలన పాఠశాల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతోంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, పాఠశాలలు మూసివేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 మిలియన్ల పిల్లల విద్య ప్రభావితమైంది. భవిష్యత్తులో, పిల్లల పోషకాహారానికి, విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులపై దీని ప్రతికూల పరిణామాలు కనిపిస్తాయి.
మన దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో, అనేక రాష్ట్రాల్లో పాఠశాలలను తెరవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే, కొన్ని రాష్ట్రాలు పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ పరిస్థితులు గమినిస్తే, 50 కి పైగా దేశాలలో పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా ప్రారంభిచడం జరిగింది.
భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభించారు? పాఠశాలలు ప్రారంభించడానికి ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రయత్నాలు ఏమిటి? ఇప్పుడు మీ పిల్లలను పాఠశాలకు పంపించడం సురక్షితమేనా? పాఠశాలల్లో పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలల పరిస్థితి ఏమిటి? పాఠశాల ప్రారంభించడం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం ..
మహారాష్ట్రలో పాఠశాలలు తెరిచారు.. జూలై 15 నుండి గ్రామీణ ప్రాంతాల్లో 8 నుండి 12 వరకు 5,900 పాఠశాలల్లో ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభించబడ్డాయి. ఈ పాఠశాలలన్నీ కొత్తగా కరోనా కేసులు వెలుగుచూడని ప్రాంతాల్లోనివే. ఈ పాఠశాలల్లో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అయితే, విద్యార్థుల భద్రత కోసం, ఈ పాఠశాలల్లో కోవిడ్ ప్రోటోకాల్ అనుసరిస్తున్నారు. ముంబై, పూణే, నాగ్‌పూర్ వంటి పెద్ద నగరాల్లో ప్రస్తుతానికి పాఠశాలలు ఇంకా తెరవలేదు.
గుజరాత్: జూలై 15 నుండి 12 వ తరగతి విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభించారు. కళాశాలలు, సాంకేతిక సంస్థలు కూడా 50% సామర్థ్యంతో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం ఐచ్ఛికం. ఇందుకోసం తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఇప్పుడు పాఠశాలకు రావడానికి ఇష్టపడని పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు కూడా కొనసాగుతున్నాయి.
హర్యానా: జూలై 16 నుండి 9 నుండి 12 వరకు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. 6 నుండి 8 వరకు పాఠశాలలు కూడా జూలై 23 నుండి ప్రారంభమవుతాయి. తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతి తర్వాతే విద్యార్థులను పాఠశాలకు అనుమతించారు. ఆన్‌లైన్ తరగతులు కూడా కొనసాగుతాయి. పాఠశాలలో కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించడం అవసరం.
పంజాబ్: కనీసం 15 రోజుల ముందుగానే ఒక మోతాదు వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులు ఆఫ్‌లైన్ తరగతులకు హాజరుకావడానికి అనుమతి ఇచ్చారు. 9 నుండి 12 వరకు పాఠశాలలు జూలై 19 నుండి చండీగడ్లో ప్రారంభించారు. అయితే, దీని కోసం తల్లిదండ్రుల సమ్మతి అవసరం. అదేవిధంగా ఆన్‌లైన్ తరగతులు కూడా కొనసాగుతున్నాయి.
బీహార్: జూలై 12, 11, 12 నుండి డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు 50% సామర్థ్యంతో ప్రారంభమయ్యాయి. కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మిగిలిన తరగతులకు పాఠశాలను తెరవాలనే నిర్ణయం త్వరలో తీసుకోవాలని భావిస్తున్నారు. అన్ని విద్యా సంస్థలలో కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించడం అవసరం.
కర్ణాటక: వైద్య, దంత కళాశాలలు ప్రారంభించారు. టీకా ఒక మోతాదు తీసుకున్న విద్యార్థులు ఆఫ్‌లైన్ తరగతులకు హాజరుకావచ్చు. త్వరలో ఇతర కళాశాలలను కూడా ప్రారంభించే నిర్ణయం తీసుకునే దిశలో ఆలోచనలు సాగుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్: జూలై 19 నుండి 9 నుండి 12 వరకు పాఠశాలలు ప్రారంభించారు. అయితే, దీని కోసం తల్లిదండ్రుల సమ్మతి అవసరం. ఆన్‌లైన్ తరగతులు కూడా కొనసాగుతాయి.
పాఠశాలలు త్వరలో ప్రారంభించబోయే రాష్ట్రాలు
మధ్యప్రదేశ్: 11, 12 తరగతులకు పాఠశాలలు జూలై 26 నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు 15 తరువాత, మూడవ వేవ్ దృష్టిలో ఉంచుకుని, పాఠశాలలు మిగిలిన తరగతులకు కూడా తెరుస్తారు. దీనితో పాటు ఆగస్టు 1 నుంచి కాలేజీల్లో ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు సగం సామర్థ్యంతో తెరుచుకుంటాయి. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజించారు. ప్రతి బ్యాచ్ ప్రతి రోజు పాఠశాలకు రావలసి ఉంటుంది. అంటే, ఒక బ్యాచ్ విద్యార్థులు మొదటి రోజు, రెండవ బ్యాచ్ మరుసటి రోజు తరగతులకు హాజరవుతారు.
ఒడిశా: జూలై 26 నుండి 10 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు పాఠశాలలను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు కూడా కొనసాగుతాయి. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం పాఠశాలకు రావడం ఐచ్ఛికం.
ఆంధ్రప్రదేశ్: ఆగస్టు 16 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించారు.
ఇంకా నిర్ణయం లేదు..
రాజస్థాన్: ఆగస్టు నుండి రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించవచ్చు. పాఠశాల ప్రారంభంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. పాఠశాలలు ఎలా తెరుచుకుంటాయనే దానిపై విద్యా శాఖ ప్రతిపాదన చేసింది.
ఉత్తర ప్రదేశ్: జూలై 1 నుండి ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కోసం పాఠశాలలు ప్రారంభించారు. అయితే, విద్యార్థులు ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో చదువుకోవాలి. ప్రస్తుతం, రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఢిల్లీ: ప్రస్తుతానికి ఢిల్లీలో పాఠశాల తెరవడానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. టీకా పూర్తయ్యే వరకు పాఠశాలలను తిరిగి తెరిచే ఆలోచన లేదని కేజ్రీవాల్ చెప్పారు. దీనితో పాటు ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో పాఠశాలలు మూసివేయబడ్డాయి.
ఇప్పుడు పాఠశాల తెరవడం సురక్షితమేనా?
ప్రపంచంలోని 170 దేశాలలో జూలై ప్రారంభంలో పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, మిడిల్ క్లాస్ విద్యార్థులు సుమారు 2 నుండి 11 వయస్సు పిల్లలు. ఈ వయసు వారిలో కరోనా సంక్రమణ ప్రమాదం చాలా తక్కువ. అందుకే వారిని బడికి పంపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వివిధ సెరో సర్వేలు పిల్లలలో 80% వరకు సెరోపోసిటివిటీ రేట్లు కనుగొన్నాయి. అంటే, వారికి కరోనా వచ్చే ప్రమాదం చాలా తక్కువ. మహమ్మారి తీవ్ర సమయంలో చాలా దేశాలలో పాఠశాలలు స్వల్ప కాలానికి మూసివేశారు. కేసులు తగ్గడం ప్రారంభించిన వెంటనే, పాఠశాలలను మళ్లీ ప్రారంభించారు.
కరోనా నుండి పిల్లలకు ఎంత ప్రమాదం ఉండొచ్చు?
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మూడవ వేవ్ పిల్లలకు మరింత ప్రమాదకరంగా ఉంటుందని శాస్త్రీయ ఆధారం లేదు. మొదటి, రెండవ వేవ్ లను పరిశీలిస్తే, పిల్లలపై తక్కువ ప్రభావం ఉంటుంది. మొత్తం తీవ్రమైన రోగులలో 10 నుండి 11% మాత్రమే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. పిల్లలకు వచ్చే ప్రమాదం తక్కువ అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం కూడా ఉంది. వైరస్ ఊపిరితిత్తులలో ఉన్న ACE-2 అని పిలువబడే గ్రాహకాలతో జతకూడుతుంది. పిల్లలలో ఈ గ్రాహకాలు అభివృద్ధి చెందవు. ఈ కారణంగా, పిల్లలలో సంక్రమణ తర్వాత కూడా, తీవ్రమైన లక్షణాలు కనిపించవు.
మూడవ లేదా నాల్గవ వేవ్ ఉన్న దేశాలలో కూడా, పిల్లలు పెద్దగా ప్రభావితం కాలేదు. కొత్త వేరియంట్లు కూడా పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేయవు. అంటే, పోల్చి చూస్తే, పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు.
పాఠశాల ప్రారంభించే ముందు పిల్లల భద్రత కోసం తీసుకోవలసిన చర్యలు ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు ఎక్కడెక్కడ ప్రారంభం అయ్యాయి?
ప్రపంచ బ్యాంక్, జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, యునిసెఫ్ సంయుక్తంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ రికవరీ ట్రాకర్‌ను సృష్టించాయి. దీని ప్రకారం, చైనా, యుకె, ఫ్రాన్స్, స్పెయిన్ సహా ప్రపంచంలోని 51 దేశాలలో పాఠశాలలు పూర్తిగా ప్రారంభం అయ్యాయి. దీనితో పాటు, పాఠశాలలు పాక్షికంగా తెరిచిన 90 దేశాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు వివిధ రీతుల్లో బోధిస్తున్నారు. కొన్ని చోట్ల ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల రోజు విడిచి రోజు విద్యార్థులను పాఠశాలకు పిలుస్తున్నారు.