Sankranthi Sambaralu: మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఇంటింటి రంగవల్లులు.. జోరందుకున్న పందేలు

| Edited By: Anil kumar poka

Jan 13, 2022 | 5:59 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి.

Sankranthi Sambaralu: మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఇంటింటి రంగవల్లులు..  జోరందుకున్న పందేలు
Sankranthi.2
Follow us on

Sankranthi Celebrations 2022: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. పండగ కంటే ముందే పలు ప్రాంతాల్లో ఎడ్ల పందాలు జోరందుకున్నాయి. సంబరాల్లో ప్రజా ప్రతినిధులు నేతలు పాల్గొని ఉత్సాహపరుస్తున్నారు.

ఏపీలో పండగ శోభ మొదలైంది. కోనసీమలో సంబరాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ముగ్గుల పోటీలు మొదలయ్యాయి. రంగు రంగుల రంగవల్లులతో యువతులు, మహిళలు అందమైన ముగ్గులు వేస్తూ పండగకు ముందే కొత్త శోభను తీసుకొస్తున్నారు. కోనసీమలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సందడి మరింత ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అంబరాన్ని తాకాయి సంక్రాంతి సంబరాలు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సంప్రదాయ సంక్రాంతి సంబరాలు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగా గీతా, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అడిషనల్ ఎస్పీ కరణంకుమార్. బోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, సాంప్రదాయ నృత్యాలతో వైభవంగా జరిగాయి. అమ్మాయిల నృత్యం ఆకట్టుకుంది.

సాంప్రదాయ దుస్తుల్లో జోడెద్దుల బండి ఎక్కి సందడి చేశారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు. మహిళలతో కలిసి ముగ్గులు వేసి, నృత్యం చేసి అలరించారు కాకినాడ ఎంపీ వంగా గీత. అయితే పండగ సంబరాల్లో కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. వెలుగుబంధ గ్రామంలో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను వీడియో తీసేందుకు ఎడ్ల బండి ముందు మోటార్‌ సైకిల్‌పై ఓ వ్యక్తి వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో ఎడ్ల బండి, మోటార్‌ సైకిల్‌పై వెళ్లడంతో బోల్తా పడింది.

Read Also…. Viral: శుభముహూర్తం లేదంటూ 10 సంవత్సరాలుగా పుట్టింట్లోనే భార్య.. కోర్టుకెక్కిన భర్త, చివరకు