వ్యాలంటైన్స్-డే సందర్భంగా స్మార్ట్‌ఫోన్ల పై శాంసంగ్ అదిరిపోయే ఆఫర్లు… మరింకేందుకు ఆలస్యం

|

Feb 11, 2021 | 12:18 AM

ప్రేమికుల దినోత్సవం రోజు అదిరిపోయే ఆఫర్లతో రానున్నాయి మొబైల్ కంపెనీలు. అదే విధంగా స్మార్ట్ ఫోన్స్ , ట్యాబ్లేట్ లపైన శాంసంగ్ కళ్ళు చెదిరే ఆఫర్లు అందిస్తుంది...

వ్యాలంటైన్స్-డే సందర్భంగా స్మార్ట్‌ఫోన్ల పై శాంసంగ్ అదిరిపోయే ఆఫర్లు... మరింకేందుకు ఆలస్యం
Follow us on

ప్రేమికుల దినోత్సవం రోజు అదిరిపోయే ఆఫర్లతో రానున్నాయి మొబైల్ కంపెనీలు. అదే విధంగా స్మార్ట్ ఫోన్స్ , ట్యాబ్లేట్ లపైన శాంసంగ్ కళ్ళు చెదిరే ఆఫర్లు అందిస్తుంది. బుధవారం(ఫిబ్రవరి 9 ) నుంచి సోమవారం (ఫిబ్రవరి 15) వరకు ‘శాంసంగ్ డేస్ సేల్’ కొనసాగనుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ ఎ71, గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎఫ్ 41 వంటి స్మార్ట్‌ఫోన్లతోపాటు ‘గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ప్లస్’, ‘గెలాక్సీ ట్యాబ్ ఎ7’  ట్యాబ్‌లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ఆఫర్లతో శాంసంగ్ ట్యాబ్లెట్ల కొనుగోలుపై రూ. 10 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ ఎస్10 లైట్, గెలాక్సీ ఎ71, గెలాక్సీ ఎ51, గెలాక్సీ ఎ31, గెలాక్సీ ఎ21ఎస్, గెలాక్సీ ఎం51, గెలాక్సీ 31ఎస్, గెలాక్సీ ఎం 31, గెలాక్సీ ఎం21, గెలాక్సీ ఎఫ్ 41, శాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్‌ఫోన్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కు మాత్రమే. అలాగే, ఐసీఐసీఐ, కొటక్ మహింద్రా బ్యాంక్ డెబిట్ కార్డుల ఈఎంఐ లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

న్యూజిలాండ్‌‌‌‌‌‌లో భారీ భూకంపం.. భూప్రకంపనల కారణంగా ఏర్పడిన సునామి.. ఎగసిపడుతున్న సముద్రం..