సరికొత్తగా కనిపిస్తున్న చార్మినార్.. ఆకట్టుకుంటున్న మిని‏క్రాఫ్ట్ వీడియో.. నెట్టింట్లో వైరల్..

Charminar Minecraft Video: ప్రస్తుత టెక్నాలజీ, డిజిటల్ కాలంలో సరికొత్త గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్‏కు

  • Rajitha Chanti
  • Publish Date - 6:20 pm, Wed, 3 March 21
సరికొత్తగా కనిపిస్తున్న చార్మినార్.. ఆకట్టుకుంటున్న మిని‏క్రాఫ్ట్ వీడియో.. నెట్టింట్లో వైరల్..

Charminar Minecraft Video: ప్రస్తుత టెక్నాలజీ, డిజిటల్ కాలంలో సరికొత్త గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్‏కు చెందిన చారిత్రాత్మక కట్టడం చార్మినార్‏కు సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మిన్ క్రాఫ్ట్ గేమ్ లో రెడిడిట్ యూజర్ తయారు చేసాడు. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అందమైన పరివర్తనతో ఐకానిక్ చార్మినార్‏ను చూపిస్తుంది.

ఇక ఇది చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అంతేకాకుండా చార్మినార్‏ను అంత అందంగా మార్పుచేసినందుకు అతడిని ప్రశంసిస్తున్నారు. మోజాంగ్ డెవలప్ చేసిన శాండ్ బాక్స్ వీడియో గేమింగ్‏కు సంబంధించిన మిన్ క్రాఫ్ట్ గేమ్ యాప్. దీనిని జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‏లో మార్కస్ వాచ్ పెర్సన్ రూపొందించారు. ఈ గేమ్‏లో ప్లేయర్ పర్వతాలు, అడవులు, గుహలు, మైదానాలు, మహాసముద్రాలు వంటి బయోమ్‏లతో పెద్ద యాదృచ్చిక ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. ఇందులో ప్రపంచంలో ఉన్న మంచు కొండలు కనిపిస్తాయి. వాటిని తొలగించడం, నిర్మించడం లేదా మార్చడం చేయవచ్చు. రాత్రి, పగలు అనే వాటిని కూడా ఇందులో సృష్టించవచ్చు.

చార్మినార్ గురించి.. ఛార్మినార్ అంటే నాలుగు స్తంభాలు కలిగినది అని అర్ధం. స్మారక చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం ప్రస్తుతం హైదరాబాద్ నగరంకు ప్రపంచ ప్రఖ్యాత చిహ్నంగా పేరుగాంచింది. ఛార్మినార్ కు నాలుగు వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న నాలుగు మినార్ ల ఎత్తులను నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ఛార్మినార్ ను నిర్మించాడు. 1889లో హైదరాబాద్ ను పాలించిన మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి ఛార్మినార్ నాలుగు వైపులా ఏర్పాటు చేశారు.

Also Read:

హాలీడే ట్రిప్ కోసం కేరళ వెళ్తున్నారా ? అయితే మీకోసం కేరళలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల వివరాలు..

బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడేవారు ఈ టిప్స్ ఫాలో అయితే తగ్గుతాయట.. మరీ మీరు ట్రై చేయండి..