Car: కారు పొగ రంగు ఆధరంగా.. సమస్య ఏంటో చెప్పొచ్చు..

|

Jul 04, 2024 | 7:53 PM

డీజిల్‌ కారు నుంచి వచ్చే పొగ నల్లగా ఉంటే. వాహనంలో సమస్యలు ఉండే అవకాశం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. సాధారణంగా కారులోని ఫ్యూయెల్ ఇంజెక్టర్ దెబ్బ తింటే.. ఈ రకమైన పొగ వెలువడుతుంది. వాహనాన్ని ఎక్కువ రోజులుగా వినియోగిస్తుంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ చెడిపోతుంది, అంతే కాకుండా డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్‌లలో ఏవైనా సమస్యలు ఉన్నా నలుపు రంగులోనే...

Car: కారు పొగ రంగు ఆధరంగా.. సమస్య ఏంటో చెప్పొచ్చు..
Car Smoke
Follow us on

పెట్రోల్‌, డీజీల్‌ ఇలా ఏ ఇంధనంతో నడిచే వాహనమైన పొగ రావడం సర్వసాధారణమైన విషయం. అయితే వాహనంలో నుంచి వచ్చే పొగ ఆధారంగా కారు పరిస్థితిని అంచనా వేయొచ్చని మీకు తెలుసా.? అందుకే మెకానిక్స్‌ కారు కండిషన్‌ చెకే సమయంలో ముందుగా పొగను పరిశీలిస్తారు. కారు పొగ రంగు ఆధారంగా కారు ఇంజన్‌లో ఉన్న సమస్యను గుర్తిస్తారు. ఇంతకీ ఏ రంగు దేనిని సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

డీజిల్‌ కారు నుంచి వచ్చే పొగ నల్లగా ఉంటే. వాహనంలో సమస్యలు ఉండే అవకాశం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. సాధారణంగా కారులోని ఫ్యూయెల్ ఇంజెక్టర్ దెబ్బ తింటే.. ఈ రకమైన పొగ వెలువడుతుంది. వాహనాన్ని ఎక్కువ రోజులుగా వినియోగిస్తుంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ చెడిపోతుంది, అంతే కాకుండా డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్‌లలో ఏవైనా సమస్యలు ఉన్నా నలుపు రంగులోనే పొగ వస్తుందని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంగా పొగ ఎక్కువగా వస్తుంటే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఇక పెట్రోల్ కారులో కూడా కొన్ని సందర్భాల్లో నల్లటి పొగ ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కారులో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం నల్లటి పొగ, అది కూడా పెద్ద మొత్తంలో వస్తుంటే మాత్రం వెంటనే సర్వీస్‌ సెంటర్‌ను సందర్శించాలి.

కొన్ని సందర్భాల్లో కారు నుంచి నీలం రంగు కూడా వస్తుంటుంది. ఇలా వస్తుంటే కారులోని ఆయిల్ కాలిపోతున్నట్లు అర్థం చసుకోవాలి. కారు ఇంజన్ ఆయిల్ సిస్టమ్‌లో సమస్యలు ఉంటే పొగ నీలం రంగులో వస్తుంది. ఈ కారణంగా ఆయిల్‌ లీక్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్లూ కలర్‌ కనిపిస్తే వెంటనే మెకానిక్‌కు చూపిచాలి.

ఒకవేళ కారులో నుంచి తెల్లని పొగ వస్తుంటే అలర్ట్‌ అవ్వాలని అర్థం. పెద్ద మొత్తంలో తెల్లని పొగ నిరంతరం వెలువడుతుంటే, సమస్య ఉందని నిర్దారించాలి. తెల్లని పొగ బయటకు వస్తే, అది ఇంజిన్ ఆయిల్ సమస్య కావచ్చు. కొన్నిసార్లు తెల్లని పొగకు కొద్దిగా నీలం రంగు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తెల్లటి పొగ వస్తుంటే ఇంజన్‌లో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..