RBI office attendant recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచులలోని ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్లో 57 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 15 చివరితేదీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.rbi.org.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఇందులో మొత్తం ఖాళీలు ఉండగా.. పదవ తరగతి పూర్తైనవారు అర్హులు. ఫిబ్రవరి 2, 2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ఫిబ్రవరి 1, 2021 నాటికి అభ్యర్థుల వయసు 18-24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఆన్ లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆన్ లైన్ లోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్ లైన్ లేదా మరే ఇతర పద్ధతుల్లో అప్లికేషన్స్ సమర్పించకూడదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, జనరల్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9, 10 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://www.rbi.org.in/ సందర్శించండి.
Also Read:
yellow watermelons: పసుపు పుచ్చకాయలను పండిస్తున్న కర్ణాటక రైతు.. లక్షలు సంపాదన..