
మనం ఆలయం దాకా వెళ్లకుండానే మన కష్టాలను ఒక ఉత్తరంపై రాసి పంపితే కోరికలు తీర్చే త్రినేత్ర గణేశుడి ఆలయం రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా రణథంబోర్‌లో ఉంది. ఇక్కడ వినాయకుడు మూడు నేత్రాలతో వెలిశాడు. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని ఒక చిన్న ఉత్తరంపై రాసి పంపితే.. వాటిని ఆ గణపయ్యే స్వయంగా చదివి మన సమస్యలను నెరవేర్చుతాడని ఇక్కడి వచ్చే భక్తుల అపార నమ్మకం. అందుకే ఇది నమ్మే చాలా మంది భక్తులు తమకు ఏ కష్టం వచ్చినా వాటిని ఒక ఉత్తరంపై రాసి వెంటనే స్వామి వారి ఆలయం అడ్రస్‌కు పోస్ట్ చేస్తారు. అలా వచ్చిన ఉత్తరాలను స్థానిక పోస్ట్ మ్యాన్ ఆలయ పూజరికి అందజేస్తారు. పూజారి వాటిని స్వామి వారి గర్బగుడిలో ఉంచుతాడు.
ఇలా రోజూ వందల మంది భక్తులు స్వామి వారికి తమ కష్టాలను విన్నవించుకుంటూ ఉత్తరాలు రాస్తారని స్థానికులు చెబుతున్నారు. కొరికలు తీర్చమనే కాదు.. కొందరు భక్తులు తమ నివాసాల్లో జరిగే శుభకార్యాలకు కూడా గణపయ్యను ఆహ్వానిస్తూ ఉత్తరాలు రాస్తుంటారు. ఈ గణపయ్య ఆలయానికి ఉత్తరాలు రాసే వారు.. రణథంబోర్ గ్రామం, సవాయ్ మధోపుర్ జిల్లా, పిన్ కోడ్ 322021 చిరునామాను కరెక్ట్‌గా రాయాలని పండితులు చెబుతున్నారు.
ఆరావళి, వింధ్య పర్వతాల్లో క్రీ.శ. 1299లో నాటి రణతంబోర్ పాలకుడు హమ్మీర్‌దేవ రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయంలో వినాయకుడి కుటుంబాన్ని మొత్తం మన ఒకే దగ్గర చూడవచ్చు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీతో యుద్దం సమయంలో రాజువారి కలలోకి వినాయకుడు వచ్చి ఖిల్జీపై విజయం సాధించేందుకు సాయం చేశాడని.. అందుకే మహారాజా తన కోటలోనే త్రినేత్ర వినాయకుడికి ఆలయాన్ని నిర్మించినట్టు అక్కడి పండితులు చెబుతున్నారు. ఈ ఆలయం సవాయి మాధోపూర్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.