Rain on Your Wedding Day: ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి వేడుక ఒక మధురమైన జ్ఞాపకం.. అందుకనే ఏ దేశంలో నైనా వివాహ వేడుకను బంధు మిత్రులు సమక్షంలో గొప్పగా జరుపుకుంటారు. ఇక మన దేశంలో పెళ్లి వేడుక అంటే ఒక పండగే. అయితే హిందూ మతంలో పెళ్లిళ్ల ముహుర్తాలను పంచాంగం అనుసరించి వధూవరుల నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు. ఈ పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని కోరుకుంటారు. అయితే పెళ్లి జరుగుతున్న సమయంలో వర్షం కురిస్తే.. పెళ్లి చేసుకుంటున్న జంటకు అంతా శుభమే జరుగుతుందని… సంతానోత్పత్తికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇక చాలా వర్షం కురవడం చాలా పవిత్రంమని పెద్దలు చెబుతారు.
పెళ్లిరోజు ఏడవడం వధువు పెళ్లిరోజు ఏడిస్తే, అదృష్టం అని భావిస్తారు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి ముందు వధువు ఇప్పుడు కన్నీటిని చిందిస్తే, పెళ్లి అయిన తరువాత ఎప్పుడూ ఏడవదు అని నమ్మకం. పెళ్లి రోజున గడప దాటే ముందే ఆమె ఏడిచే కన్నీరే చివరి కన్నీరు అని ఓ మూఢ నమ్మకం.
ఇవే కాదు ఇంకా అనేక నమ్మకాలున్నాయి ఇక పూర్వ కాలంలో పెళ్ళికి ముందు వధూవరులు ఒకరినొకరు చూసుకోడదు అనే నియమం పెట్టారు. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
పాలు దొర్లడం ఒక ఇలాంటి శుభకార్యాలప్పుడు ఒక రోజు ముందు లేదా తరువాత పాలు దొర్లితే ఆ దురదృష్ట చిహ్నాలు ఆ జంటపై ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు. కాబట్టి, ఆ ప్రత్యేకమైన రోజున పాలు దొర్లకుండా చూసుకోవాలి అనేది కుటుంబీకుల లక్ష్యం. వధువు, వరుడి మీద అక్షతలు జల్లి పెద్దలు ఆశీర్వాదం అందిస్తారు.
ఇది సంతానోత్పత్తికి, సమృద్ధికి చిహ్నం. కొన్ని సంస్కృతులలో, ఈ సంప్రదాయం దుష్ట ఆత్మల నుండి కొత్తగా పెళ్లి చేసుకునే వారిని రక్షిస్తుందని నమ్ముతారు. ముందు కుడికాలు పెట్టడం పురాతన సంప్రదాయం ప్రకారం, వధువు మొదటగా ఎడమకాలు పెట్టి కొత్త ఇంట్లోకి వస్తే దురదృష్టంగా భావిస్తారు. కాబట్టి, కొత్తగా పెళ్ళైన వధువు తన కుడికాలు ముందుపెట్టి ఇంట్లోకి ప్రవేశించాలి. గంటలు మోగించడం ఐరిష్ వివాహాలలో సంప్రదాయంగా గంటలు మోగిస్తారు. దుష్ట ఆత్మలు దూరంగా వెళ్ళిపోయి, ఒక శ్రావ్యమైన కుటుంబ జీవితం ఏర్పడుతుందని నమ్మకం. కొత్తగా పెళ్ళైన వారికి గంటలు బహుమతిగా కూడా ఇస్తారు. సాలెపురుగులు పెళ్లి దుస్తుల్లో కనిపిస్తే అదృష్టంమని కొంత మంది నమ్మకం.
Also Read: