AAP MLA Mother as Sweeper: పంజాబ్(Punjab)లో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో.. ఆ పార్టీ గెలుపు వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి రెండు ప్రధాన కారణాలు ఏంటంటే.. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) అంతర్గత విభేదాలను ఎదుర్కొంటుండగా, మరోవైపు శిరోమణి అకాలీదళ్‌పై రాష్ట్ర ప్రజల విశ్వాసం సన్నగిల్లింది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి నాయకులుగా ఉన్న వారికే పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే లభ్ సింగ్(Labh Singh) తల్లి వృత్తి రీత్యా స్వీపర్, అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే లభ్ సింగ్ గెలిచిన తర్వాత కూడా ఆమె తన పనిని వదులుకోవడంలేదు.
ఆప్ అభ్యర్థి లబ్ సింగ్ ఉగోకే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాజా మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఓడించారు. కానీ అతని తల్లి స్వీపర్ ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. లభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు స్వీపర్. శుక్రవారం నాడు డ్యూటీకి చీపురుతో బల్దేవ్ చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక రోజు ముందు, ఆయన కుమారుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని 37,558 భారీ తేడాతో ఓడించారు. ఈ సందర్భంగా బల్దేవ్ కౌర్ మాట్లాడుతూ, “నా కొడుకు గెలిచిన తర్వాత కనీసం ఒక్కరోజు కూడా నేను పనికి రానని వారంతా అనుకున్నారు. కానీ నా కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, నేను కాదు, నేను ఇప్పటికీ కాంట్రాక్ట్ స్వీపర్‌ని.. నేను నా ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోవాలా?” అని ప్రశ్నిస్తున్నారు.
ఆమె గత 22 ఏళ్లుగా బర్నాలా జిల్లాలోని తన స్వగ్రామమైన ఉగోకేలోని ఓ పాఠశాలలో పనిచేస్తోంది. తన సర్వీసును రెగ్యులరైజ్ చేయకపోవడంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ కోసం పదేపదే నా కేసును కొనసాగించారని, కానీ ప్రతిసారీ కొట్టివేయబడుతుందని అన్నారు. బల్దేవ్‌కి ఇప్పుడు 50 ఏళ్లు దాటాయి. ఉద్యోగం వదలబోనని ఎమ్మెల్యే కుమారుడికి స్పష్టంగా చెప్పినట్లు ఆమె చెబుతున్నారు. “నేను చేస్తున్న పనికి నేను గర్వపడుతున్నాను. మా కుటుంబం జీవనోపాధి కోసం కష్టపడుతున్నప్పుడు నా ఉద్యోగం ఒక ముఖ్యమైన ఆదాయ వనరు అన్నారు.
Punjab | Baldev Kaur, mother of AAP’s Labh Singh, who defeated Congress’ Charanjit S Channi from Bhadaur in Barnala, continues to work as a sweeper at a govt school in Ugoke village. She says,” ‘Jhadu’ is an important part of my life. I’ll continue to do my duty at the school.” pic.twitter.com/OuX5kIPLFr
— ANI (@ANI) March 13, 2022
బల్దేవ్ కౌర్ ఇల్లు ఆమె కుటుంబంలోని వినయాన్ని చూపుతుంది. సిఎం చన్నీకి వ్యతిరేకంగా నిజమైన పేద వర్సెస్ నకిలీ పేద ఈసారి ఎన్నికల ఇష్యూ చేయడంలో లభ్ సింగ్ విజయం సాధించారు. బల్దేవ్ కౌర్ భర్త దర్శన్ సింగ్ జీవితాంతం కూలీగా ఉండేవారు. అయితే ఇటీవల కంటికి శస్త్ర చికిత్స చేయడంతో పని మానేశారు.
ఇదిలావుంటే, పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు రాష్ట్రంలోని పలువురు ప్రముఖ నాయకులను ఓడించారు. ఇందులో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సిన పెద్ద నేతలు చాలా మంది ఆప్ అభ్యర్థిపై ఓడిపోయారు. లభ్ సింగ్ గురించి మాట్లాడుతూ, అతను ఉగోకే గ్రామంలో మొబైల్ దుకాణాన్ని నడుపుతున్నారు. అతను బదౌర్ స్థానం నుండి చరణ్జిత్ సింగ్ చన్నీని ఓడించారు.
Read Also…. CWC Meet: హాట్‌హాట్‌గా సీడబ్యూసీ సమావేశం.. నాయకత్వ మార్పును కోరుతున్న జీ-23 నేతలు