Viral: 45 కిలోమీటర్లు.. 6 రోజులు.. ఒక్క స్టూడెంట్ కోసం ఈ టీచర్ ఏం చేసిందంటే..

Maharashtra: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అని ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. విద్య.. ఒక వ్యక్తి ఉన్నతకి దోహదపడుతుంది. అందుకే బాల్యం దశ నుంచే విద్యాభ్యాసం చాలా కీలకం. కొందమంది పిల్లలు ఎన్నో కష్టనష్టాలను అధిగమిస్తూ చదువుకునేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు.

Viral: 45 కిలోమీటర్లు.. 6 రోజులు.. ఒక్క స్టూడెంట్ కోసం ఈ టీచర్ ఏం చేసిందంటే..
Teacher And Student
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 03, 2023 | 2:30 PM

Maharashtra: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అని ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. విద్య.. ఒక వ్యక్తి ఉన్నతకి దోహదపడుతుంది. అందుకే బాల్యం దశ నుంచే విద్యాభ్యాసం చాలా కీలకం. కొందమంది పిల్లలు ఎన్నో కష్టనష్టాలను అధిగమిస్తూ చదువుకునేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. మౌలిక సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకునేందుకు కొండగు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని వెళ్లా్ల్సి వస్తుంది. కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ స్కూళ్లకు వెళ్తుంటారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇక్కడ మాత్రం పరిస్థితి రివర్స్ అయ్యింది. విద్యార్థులకు చదువు చెప్పేందుకు.. కాదు కాదు.. ఒక విద్యార్థిని చదువు చెప్పేందుకు ఓ టీచర్ ఏకంగా 45 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. అవును, ఒకే ఒక్క విద్యార్థిని కోసం.. అది కూడా ఒకటవ తరగతి విద్యార్థిని కోసం ఆ టీచర్ 45 కిలోమీటర్లను సుమారు 6 గంటలు ప్రయాణిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పూణె పరిధిలోని టీసర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తు్నారు మంగళ ధావలే. ఆ స్కూల్‌లో సియా షెలార్ అనే విద్యార్థిని ఒకటవ తరగతి చదువుతోంది. పూణె జిల్లాల్లోని 3,638 ప్రాథమిక పాఠశాలల్లో ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు ఉన్న 21 స్కూళ్లలో అటల్ వాడి స్కూల్ ఒకటి. ఈ స్కూల్‌లో చిన్నారి మాత్రమే చదువుతోంది. ఈ చిన్నారి కోసం స్కూల్ టీచర్ మంగళ ధావలే వస్తోంది.

45 కిలోమీటర్లు ప్రయాణం..

మంగళ ధావలే తన భర్త, ఇద్దరు పిల్లలతో పూణే సమీపంలో నివసిస్తున్నారు. ఓవైపు కుటుంబ బాధ్యతను నిర్వహిస్తూనే.. మరోవైపు చిన్నారికి పాఠాలు చెప్పేందుకు ప్రతిరోజూ 45 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. మంగళ ధావలే భర్త కూడా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడే, ఆమె ఉదయం పాఠశాలకు వెళుతుంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు కాగా.. 12 చిన్నారి స్కూల్‌కు వెళ్తుంది. మరో పిల్లాడు చిన్నోడు అవడంతో డే కేర్ సెంటర్‌లో వదిలేసి స్కూల్‌లో పాఠాలు చెప్పేందుకు వెళ్తుంది. ఇక సాయంత్రం ఆమె కూతురు ఆ చిన్నోడిని ఇంటికి తీసుకువస్తుంటుంది. తాను బోధించడానికి వెళ్లే చోట నెట్‌వర్క్ లేదని, అందుకే తన పిల్లలతో మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది మంగళ.

ఒక్కరే ఉండటం వల్ల ఉపయోగం లేదు..

సియా షెలార్ ప్రాంతానికి రవాణా సౌకర్యం కల్పిస్తే.. పాన్‌షెట్ వంటి క్లస్టర్ స్కూళ్లలో చదువుకునేందుకు ఆస్కారం లభిస్తుంది. తద్వారా చిన్నారి బాగా చదువుకునేందుకు ఉపకరిస్తుందని మంగళ అభిప్రాయపడ్డారు. ఒక స్టూడెంట్ ఒకే గురువు నుంచి అన్ని అంశాలను నేర్చుకోలేరని, విద్యార్థులు తమ చోటి విద్యార్థుల నుంచి చాలా నేర్చుకుంటారని చెప్పుకొచ్చారు. కానీ, ఇక్కడి స్కూల్‌లో సియా, తాను మాత్రమే ఉండటం వలన చిన్నారికి నేర్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని చెప్పుకొచ్చారు మంగళ.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..