మన వ్యక్తిత్వం ఎలాంటిదో మన ఆలోచనలు, మన నడవడి ఆధారంగా చెప్పొచ్చు. అయితే మన ముఖ కవలికలు, కనుబొమ్మలు, ముక్కు ఆకారం ఆధారంగా కూడా మనం ఎలాంటి వాళ్లమో మన ఆలోచనలు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు. అయితే చెవి ఆధారంగా కూడా మన వ్యక్తిత్వంత ఎలాంటిదో చెప్పొచ్చని అంటున్నారు.
పైన కనిపిస్తున్న ఫొటోలో మొత్తం 4 రకాల చెవులు కనిపిస్తున్నాయి. వీటిలో మీ చెవి ఆకారం ఏంటన్న దానిపై మీ ఆలోచనలు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న విధంగా మీ చెవి ఆకారం ఆధారంగా మీరు ఎలా ఆలోచిస్తారు.? మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది.? అనే విషయాలు తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఫొటోలో కనిపిస్తున్నట్లు ‘A’లో ఉన్నట్లు పెద్ద చెవి ఆకారం ఉన్నట్లయితే. మీరు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ప్రశాంతంగా, స్థిరంగా ఎదుర్కొంటారని అర్థం. ఏ విషయాన్ని పెద్దగా టెన్షన్ అవ్వకుండా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయాన్ని అంత సులభంగా వదిలిపెట్టరు, నిరాశకు గురికారు. సాధించే వరకు ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. భవిష్యత్తు గురించి పెద్దగా ఆందోళన చెందరు.
* ‘B’ ఆకారంలో ఉన్నట్లు చెవి చివరల్లో చిన్నగా ఉంటే మీరు అంతర్ముఖత మనస్తత్వం కలిగిన వారని అర్థం. మీరు ఒంటరిగా ఉండడానికి లేదా అత్యంత సన్నిహితులతో గడపడానికే ఆనందిస్తారు. ప్రతీ సందర్భంలో మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉండరు. కానీ అవసరమైన చోట మాత్రం కచ్చితంగా మాట్లాడుతారు. మంచి సృజనాత్మకతో కలిగి ఉంటారు. నలుగురితో గడపడానికి పెద్దగా ఆసక్తి చూపించరు.
* ఇక ‘C’లో చూపించినట్లు చెవి ఆకారం ఉంటే.. మీరు మానసికంగా శక్తివంతమైన వ్యక్తులని అర్థం. అర్థం చేసుకునే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగాలకు లోనవకుండా ఉంటారు. జీవితంలో ఎంత ఎదుదెబ్బ తగిలినా జీవితంలో ముందుకు సాగాలనే లక్ష్యంతో ఉంటారు.
* అదే విధంగా ‘D’ ఆకారంలో ఉన్నట్లు చెవి కనిపిస్తే మీరు ఊహాత్మక ఆలోచనతో ఉంటారు. భావోద్వేగ మేధస్సును కలిగి ఉంటారు. ఎలాంటి భయం లేకుండా మీ భావోద్వేగాలను వ్యక్తపరుస్తారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..