
హిందూ మతంలో నెమలి ఈకను కూడా పవిత్రమైనదిగా భావిస్తారు.. ఎందుకంటే.. దేవతలకు నెమలి ఈకలు అంటే అత్యంత ప్రియమైనవిగా చెబుతుంటారు. లక్ష్మీదేవి, వినాయకుడు, కార్తికేయుడు, ఇంద్రుడు, శ్రీ కృష్ణుడికి నెమలి ఈకలు ఎంతో ఇష్టమని నమ్ముతారు.. ఇంట్లో నెమలి ఈకలు పెట్టవటం వల్ల ఇంటి అందాన్ని పెంచుతాయి. అయితే, చాలా మంది నెమలి ఈకలు ఇంట్లో ఉంచుకోవచ్చా? లేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాస్తు, జ్యోతిశాస్త్ర ప్రకారం ఇంట్లో నెమలి ఈకలు ఉంటే ఏమౌతుందో తెలుసా..? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే…
చాలా మంది తమ ఇళ్లల్లో అందం కోసం నెమలి ఈకలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే, నెమలి ఈకలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆ ఇంటికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. నెమలి ఈకలు ఇంట్లో ఉండడం వల్ల బోలెడు ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. దీనిలో ఎంతో శక్తివంతమైన దైవీక గుణాలు ఉంటాయని చెబుతున్నారు. నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని, ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు
వాస్తు ప్రకారం, ఇంట్లోని వాస్తు లోపాలను వదిలించుకోవడానికి నెమలి ఈకలను తెల్లటి దారంతో కట్టి ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నెమల ఈకను ఇంట్లో గుమ్మంకు ముందు హల్ లో ఎత్తులో పెట్టాలి. నెమలి ఈక కు ప్రతిరోజు సాంబ్రాణి పొగతో ధూపం వేయాలి. దీనిలో నెగెటివ్ ఎనర్జీని తొలగించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో డబ్బు దాచుకునే చోట నెమలి ఈకలను దాచుకోవటం వల్ల ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది. అలాగే ఇంట్లో సంపద, సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తాయని, మంచి విజయ అవకాశాలను కలిగిస్తుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..