Nithyananda Swami: అంపశయ్య పై నిత్యానంద?.. మిస్టరీగా వివాదాస్పద స్వామిజీ మరణ వార్తలు..

వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు కన్నుమూశారనే వార్త కలకలం రేపగా తాను బతికే ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అయితే తాజాగా నిత్యానంద అంపశయ్య్యపై ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Nithyananda Swami: అంపశయ్య పై నిత్యానంద?.. మిస్టరీగా వివాదాస్పద స్వామిజీ మరణ వార్తలు..
Nithyananda Swami
Follow us

|

Updated on: May 22, 2022 | 10:35 AM

Nithyananda Swami: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తమను తాము భగవంతుడి అవతారంగా చెప్పుకునే దొంగ బాబాలు అందరిలోకీ ఘటికుడుగా పేరుపొందాడు నిత్యానంద మరణంపై రోజుకో రకంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు కన్నుమూశారనే వార్త కలకలం రేపగా తాను బతికే ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అయితే తాజాగా నిత్యానంద అంపశయ్య్యపై ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అప్పట్లో నిత్యానంద రాస‌లీల‌ల వీడియో తెగ వైర‌ల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. నిత్యం ఏదొక విదాస్పద ఉదంతంలో వార్తాల్లో నిలిచేవాడు. అయినప్పటికీ నిత్యానంద స్వామికి లక్షల్లో భక్తులు ఉన్నారు. భార‌త్ వ‌దిలి రెండేళ్ల క్రితం ఈక్వెడార్ కు పారిపోయాడు. ఏకంగా త‌న కైలాసం అంటూ సొంత రాజ్యాన్ని స్థాపించాడు. అంతేకాదు నిత్యానందకు సంబదించిన ప్రతి సమాచారాన్ని ‘కైలాస’ అధికారిక వెబ్‌సైట్ అందిస్తుంటుంది. ఫేస్​బుక్​లో ఫొటోలు, వీడియోలను అప్​డేట్​ చేస్తుంటుంది. ఆయన ఫొటోలు సహా, ఆయన పేపర్​పై రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను షేర్​ చేసింది. నిత్యానంద స్వామి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో నిత్యానంద బతికిఉన్నారా? చనిపోయారా? అనేది మిస్టరీగా ఉంది.

ఈక్వెడార్​కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై నిత్యానంద స్వామి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ప్రసుత్తం సమాధిలోకి వెళ్లానని.. మాట్లాడలేకపోతున్నానని..  మనుషులను గుర్తు పట్టలేకపోతున్నట్లు నిత్యానంద స్వామి వెల్లడించారు. తాను బతికే ఉన్నానని.. 27 మంది డాక్టర్లు తనకు చికిత్స చేస్తున్నారని ఫేస్​బుక్​లో స్పష్టం చేశారు. తన శిష్యులు కంగారుపడొద్దని క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

భారత్​లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్వామీజీ 50 సార్లు కోర్టుకు హాజరై.. 2019 నవంబర్​లో భారత్​ వదిలి పారిపోయారు. కైలాస అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను పత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా చేసుకున్నారు. కొద్దిరోజులకు కైలాస డాలర్​ను తీసుకొచ్చారు. తర్వాత రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. అయితే, ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఆయన నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈక్వెడార్‌ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది.

నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. తమిళనాడులోని తిరువణ్ణామలైలో తండ్రి అరుణాచలం, తల్లి లోకనాయకికి జన్మించాడు. అతని పుట్టిన తేదీకి సంబంధించి సోర్సెస్ వైరుధ్యం – 2003 US వీసా 13 మార్చి 1977 తేదీని ఇచ్చింది. అయితే 2010 కర్ణాటక హైకోర్టు కేసులో ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్ జనవరి 1, 1978 అని పేర్కొంది. అతను మొదటిసారిగా మూడేళ్ళ వయసులో యోగిరాజ్ యోగానంద పూరిచే గుర్తించబడ్డాడు.

అతను 12 సంవత్సరాల వయస్సు నుండి శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉన్నాడని 22 సంవత్సరాల వయస్సులో పూర్తి జ్ఞానోదయాన్ని అనుభవించారు. 2002వ సంవత్సరంలో నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించాడు. మహావతార్ బాబాజీ హిమాలయాల్లో సన్యాసుల సంచారం చేస్తున్న రోజుల్లో ఒక ఆధ్యాత్మిక అనుభవంలో తనకు ఈ పేరు పెట్టారని ఆయన చెప్పారు. 2003లో, అతను భారతదేశంలోని కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని బిడాడిలో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని ప్రారంభించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో